| Daily భారత్
Logo




అధిక లాభం ఆశ చూపి కోట్లల్లో దోచేస్తున్న ముఠా అరెస్ట్

News

Posted on 2025-10-01 14:48:16

Share: Share


అధిక లాభం ఆశ  చూపి కోట్లల్లో దోచేస్తున్న ముఠా అరెస్ట్

డైలీ భారత్, వరంగల్:పెట్టిన పెట్టుబడికి అధిక మొత్తంలో లాభం ఆశ చూపిస్తూ ప్రజల నుండి కోట్ల రూపాయలను దోచేసిన నలుగురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్, పాలకుర్తి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుండి 5 లక్షల 92 వేల రూపాయలతో పాటు, 684.5 గ్రాముల బంగారు నాణాలు,150 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కారు సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, రసీదు పుస్తకాలు, క్యాష్ కౌంటింగ్ మిషన్, చెక్ బుక్స్, స్టాంప్స్ తో పాటు పొలాలు, ఇంటి స్థలాలకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన నిందితుల వివరాలు :

1.తెప్పాలి  సైదులు, తండ్రి పేరు బిక్షం, వయస్సు 55, స్వగ్రామం గడ్డి పల్లి, సూర్యాపేట జిల్లా. ప్రస్తుత నివాసం పాలకుర్తి మండల కేంద్రం, జనగామ జిల్లా.

2. మనుబోతుల రామకృష్ణ, తండ్రి పేరు సాయిరామ్, వయస్సు 36, నందిగామ, కృష్ణ జిల్లా, ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత నివాసం పాలకుర్తి మండల కేంద్రం, జనగామ జిల్లా.

3. పొడిల సురేష్ కుమార్, తండ్రి పేరు వెంకటనర్సయ్య, వయస్సు 35, స్వగ్రామం పెన్ పహాడ్, సూర్యాపేట జిల్లా, ప్రస్తుత నివాసం, పాలకుర్తి, జనగామ జిల్లా.

4.పొడిల శ్రీధర్, తండ్రి ఆంజనేయులు, వయస్సు 30, స్వగ్రామం హుజూర్ నగర్, సూర్యాపేట జిల్లా, ప్రస్తుత నివాసం పాలకుర్తి, జనగామ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడిస్తూ.. పోలీసులు అరెస్ట్ చేసిన ముఠాలోని ప్రధాన నిందితుడు తెప్పాలి  సైదులు తన భార్య నారాయణమ్మ పేరు మీద హెబ్సిబా  పేరుతో ఒక సంస్థను 2023 సంవత్సరంలో ఏర్పాటు చేసాడు.  అనంతరం ప్రధాన నిందితుడు 2024 సంవత్సరంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అధిక లాభాలు ఆశ చూపిస్తూ చీటీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ చిట్టీ లో చేరే వారు ముందుగా ఆరు వేల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. సభ్యులు చెల్లించిన డబ్బులో నాలుగు వేలు తన వద్దనే డిపాజిత్ చేసుకొని మిగితా రెండు రెండు వేల రూపాయలకు సభ్యులకు ఈ సంస్థపై నమ్మకం కలిగేందుకు సభ్యులకు రెండు వేల రూపాయల విలువ వస్తువులను అందజేస్తాడు వాస్తవంగా ఈ వస్తువుల విలువ కేవలం మూడు వందలు మాత్రమే వుంటాయి. ఈ సంస్థ లో ఒక సభ్యుడు ఎన్ని సభ్యత్వాలైన పొందవచ్చు. ఇందులో జాయిన్ అయిన ప్రతి సభ్యుడికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున 20 నెలల పాటు డబ్బు ను తిరిగి అందజేసేవాడు. ప్రధాన నిందితుడు మిగితా నిందితులతో కలసి గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని సుమారు 28,493 సభ్యత్వాలను నమోదు చేసుకోవడంతో పాటు వీరి నుండి 4వేల రూపాయల చొప్పున మొత్తం 11 కోట్ల 39 లక్షల రూపాయలు ప్రజల డబ్బు ను తన వద్దనే  భద్రపరుచుకొని వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అదే కాకుండా నిందితుడు సభ్యులకు కేవలం మూడు వందల రూపాయల విలువ వస్తువులను అందజేయడం ద్వారా మరో 4 కోట్ల 84 లక్షల రూపాయలను మోసం చేసినట్లుగా పోలీసుల దర్యాప్తు లో నిర్ధారణ అయింది. ముఖ్యంగా ప్రజలు అత్యాశతో ఈ సంస్థ లో లక్షల్లో పెట్టుబడి కూడా జరిగింది. ఈ సంస్థపై పోలీసులకు పలు పిర్యాదులు రావడంతో పాటు ఈ ముఠా సభ్యులు ప్రజల సొమ్ము తో తప్పించు పారిపోయే ప్రమాదాన్ని గుర్తించిన పోలీసులు ముఠా సభ్యులను అదుపులోకి విచారించగా ఈ ముఠా పాల్పడే మోసం పోలీసులకు వెల్లడించడంతో పాటు ఈ ముఠా వసూల్ చేసిన డబ్బును వివిధ 17 బ్యాంకుల్లో జమ చేసినట్లుగా గుర్తించిన పోలీస్ అధికారులు, 5 కోట్ల 48 లక్షల, 64 వేల రూపాయలకు సంబంధించి ఎలాంటి లావా దేవీలు జరగకుండా బ్యాంక్ ఖాతాలను నిలిపివేయడం జరిగిందని 

ప్రధాన నిందితుడు పై గతంలో మెదక్, సూర్యాపేట జిల్లాలతో పాటు ఇల్లందు, ఎల్.బి నగర్ పోలీస్ స్టేషన్ల లో సుమారు పదికి పై గా  చీటింగ్ కేసులు ఉన్నట్లు వరంగల్  సీపీ వెల్లడించారు.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడు తూ ప్రజలు అధిక మొత్తం లో లాభం వస్తున్నది అని బోగస్ కంపెనీ లను నమ్మి ఎక్కువ మొత్తం లో డబ్బులు జమ చేస్తే ఎప్పుడో ఒకప్పుడు ఆ కంపెనీ బోర్డ్ తిప్పేస్తారు అప్పుడు మొత్తం నష్టపోతారు. ఇటువంటి మోసాగాళ్ల  మాటలు నమ్మకుండా  డబ్బులు పెట్టుబడి పెట్టేముందు జాగ్రత్తగా ఆలోచించాలి  తక్కువ సమయం లో ఎక్కువ లాభం వస్తున్నదని చెబితే ఎవరు నమ్మవద్దని సీపీ ప్రజలకు సూచించారు.

ఈ ముఠా పట్టు కోవడంలో ప్రతిభ కనబరిచిన  వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, వర్ధన్న పేట, టాస్క్ ఫోర్స్ ఏసీపీ నర్సయ్య, మధుసూదన్, టాస్క్ ఫోర్స్ ఇన్స్ స్పెక్టర్ పవన్, పాలకుర్తి సిఐ  జానకీరాం రెడ్డి, పాలకుర్తి ఎస్.ఐ, టాస్క్ ఫోర్స్ ఎస్.ఐ వంశీ కృష్ణ, దిలీప్,తో టాస్క్ ఫోర్స్ మరియు పాలకుర్తి పోలీస్ సిబ్బంది ని పోలీస్ అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు.

Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >