Posted on 2025-10-04 14:10:19
కొణిజర్ల మండలం అంజనా పురం
గోద్రెజ్ పామాయిల్ పరిశ్రమ సత్వరమే పూర్తి చేయాలి
తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు చింత నిప్పు చలపతిరావు
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం లో ప్రైవేటు సెక్టార్ లో పామాయిల్ పరిశ్రమ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వంద ఎకరాల పైగా సాగు భూములు రైతుల నుంచి సేకరించి గోద్రెజ్ కంపెనీ కి అప్పగించి మూడు సంవత్సరాల అవుతుంది అని, పామాయిల్ పరిశ్రమ శంకుస్థాపన జరిగి రెండు సంవత్సరాల అవుతున్న పనులు పూర్తి కాలేదు అని సత్వరమే పరిశ్రమ రైతులకు అందుబాటులో కి తీసుకు రావాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు చింతనిప్పు చలపతిరావు అన్నారు.
శుక్రవారం రైతు సంఘం బృందం పామాయిల్ రైతులతో కలిసి అంజనా పురం వద్ద గోద్రెజ్ పామాయిల్ పరిశ్రమ కు కేటాయించిన భూములను పరిశీలించారు, పనులు వేగవంతం చేసి పామాయిల్ పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభం చేయుట వలన రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది అని అన్నారు, నర్సరీ లో పామాయిల్ మొక్కలు పెంపకం లో కర్లింగ్, ఆఫ్ టెక్ వాటిని గుర్తించి గ్రెడింగ్ చేసే విధానం అంజనా పురం నర్సరీ లో సరైన పద్ధతి లో ఉందని నిత్యం రైతులకు నష్టం జరగకుండా పర్యవేక్షణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపవరం సోసైటి డెరైక్టర్, పామాయిల్ రైతులు సంక్రాంతి నర్సయ్య, సంక్రాంతి పురుషోత్తం,కట్టా రాంబాబు, దుగ్గిన్ని అజయ్ తదితరులు పాల్గొన్నారు
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >