| Daily భారత్
Logo




శ్రీ సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్న ప్రధాని నరేంద్రమోడీ..సచిన్.. ఐశ్వర్యరాయ్

News

Posted on 2025-11-19 13:25:26

Share: Share


శ్రీ సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్న ప్రధాని నరేంద్రమోడీ..సచిన్.. ఐశ్వర్యరాయ్

డైలీ భారత్ న్యూస్, పుట్టపర్తి:శ్రీ సత్య సాయి బాబా జయంతి ఉత్సవాలలో భాగంగా బాబా మహా సమాధి దర్శనార్థం భారత ప్రధాని నరేంద్రమోడీ పుట్టపర్తికి విచ్చేశారు. ప్రత్యేక విమానంలో శ్రీ సత్య సాయి పుట్టపర్తి విమానాశ్రయానికి విచ్చేసిన ప్రధాని నరేంద్రమోడీకి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి నారా లోకేశ్‌తోపాటు ఇతర మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ఘన స్వాగత పలికారు.అనంతరం శ్రీ సత్య సాయి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన ప్రశాంతి మందిరానికి ప్రధాని నరేంద్రమోడీ చేరుకున్నారు.అక్కడ ప్రధా నరేంద్రమోడీకి సత్య సాయి ట్రస్ట్ సభ్యులు సాగర స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం సాయి కుల్వంత్ మందిరంలో బాబా మహా సమాధిని దర్శించుకున్న వారు ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు. అనంతరం సాయి భక్తి గానామృతం సంగీత కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు.

రూ.100 నాణెంను విడుదల చేయనున్న ప్రధాని మోడీ

అనంతరం హిల్ వ్యూ స్టేడియంలో జరుగుతున్న సత్యసాయి జయంతి వేడుకలలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్రమోడీతోపాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి నారా లోకేశ్, సత్యకుమార్ యాదవ్, సవితతోపాటు ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఈ సందర్భగా శ్రీ సత్యసాయి రూ.100 నాణెంతోపాటు పోస్టల్ స్టాంపులను సైతం ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించనున్నారు.ఇకపోతే రూ.100 నాణెం ఒకవైపు సత్యసాయిబాబా చిత్రం మరోవైపు అశోక్ స్తంభంతో ఉంది. త్వరలో ఆన్ లైన్ బుకింగ్ ద్వారా నాణెం క్రయ, విక్రయాలు జరగనున్నాయి.

శ్రీసత్యసాయికి నివాళులర్పించిన సచిన్ , ఐశ్వర్యరాయ్

శ్రీసత్య సాయి బాబా జయంతి ఉత్సవాలలో భాగంగా బాబా మహా సమాధి దర్శనార్థం క్రికెట్ మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ మాజీ హీరోయిన్ ఐశ్వర్య బచ్చన్ పుట్టపర్తికి విచ్చేశారు. ప్రత్యేక విమానంలో శ్రీ సత్య సాయి పుట్టపర్తి విమానాశ్రయానికి విచ్చేసిన సచిన్ టెండూల్కర్, ఐశ్వర్య బచ్చన్ కు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు చాముండేశ్వరి నాథ్ ,జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. శ్రీ సత్య సాయి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన ప్రశాంతి మందిరానికి చేరుకున్న సచిన్ టెండుల్కర్ ఐశ్వర్య బచ్చన్ కు సత్య సాయి ట్రస్ట్ సభ్యులు సాగర స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం సాయి కుల్వంత్ మందిరంలో బాబా మహా సమాధిని దర్శించుకున్న వారు ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు. అనంతరం సాయి భక్తి గానామృతం సంగీత కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇకపోతే నవంబర్ 18న శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. రథాన్ని లాగి సత్యసాయి శత జయంతి వేడుకలను మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్, మంత్రి సవిత , కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే సింధూర, ఎమ్మెల్యే పరిటాల సునీతలు ప్రారంభించారు. రథానికి ముందు భాగాన సత్యసాయి విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా చిన్నికృష్ణులు గోపికమ్మల వేషధారణతో సందడి చేశారు. కోలాటం, చెక్కభజనలు, కీలుగుర్రాలు, గొరవయ్యల నృత్యంతో రథోత్సవం ఆసాంతం చూపరులను మంత్రముగ్ధులను చేసింది. ఈ వేడుకలను తిలకించడానికి దేశ విదేశీ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పుట్టపర్తి పురవీధులు కిక్కిరిసిపోయాయి. మరోవైపు భక్తులకు దాతలు ఆహార పొట్లాలు, మంచినీరు అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.

Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >
Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >