| Daily భారత్
Logo




గుంతలమయమైన రోడ్లను మరమ్మతులుచేసి, కొత్తగూడెం కార్పొరేషన్లో సమస్యలు పరిష్కరించాలి : సీతాలక్ష్మి

News

Posted on 2025-11-19 16:16:25

Share: Share


గుంతలమయమైన రోడ్లను మరమ్మతులుచేసి, కొత్తగూడెం కార్పొరేషన్లో సమస్యలు పరిష్కరించాలి : సీతాలక్ష్మి

గుంతలు పడ్డ రోడ్లు మర్మతులు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన

కొత్తగూడెం కార్పొరేషన్లో సమస్యలు పరిష్కరించాలని వినతి

డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:గత మూడు నెలల కాలం నుంచి భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా గుంతలమయమైన రోడ్లను బాగు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరిగిందని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి రామవరం గోధుమ వాగు బ్రిడ్జి మీద నిరసన తెలిపారు. పాడైన రోడ్లు బాగు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం కొత్తగూడెం కార్పొరేషన్ మేనేజర్ ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. (కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో) సీతాలక్ష్మి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల పార్టీ ఇంచార్జి వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనల మేరకు నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రోడ్లు బాగు చేయాలని అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా అధికారుల తీరులో మార్పు రావడం లేదని మండిపడ్డారు. కొత్తగూడెం వ్యాప్తంగా ఎక్కడ గుంతలకు మరమ్మతులు చేసిన దాఖలాలు లేవన్నారు. తక్షణమే కొత్తగూడెం కార్పొరేషన్ వ్యాప్తంగా గుంతలు పడ్డ రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని, రామవరంలోని శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాల పార్కును అభివృద్ధి చేయాలని కోరారు. కార్పొరేషన్ పరిధిలో కోతులు, కుక్కల బెడద తగ్గించాలని తెలిపారు. రామవరం వనమా పార్కు నేమ్ బోర్డును సరి చేయాలని, పర్యవేక్షణ లోపం కారణంగా మరుగున పడ్డ మరుగుదొడ్లకు మరమ్మతులు చేయాలని స్పష్టం చేశారు. కార్పొరేషన్ వ్యాప్తంగా పాడయిన చోట స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని, మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం తవ్విన సీసీ రోడ్లను తిరిగి నిర్మించి పంపు కనెక్షన్లు ఇవ్వాలన్నారు. మూలనపడ్డ పారిశుద్ధ్య ట్రాలీలకు మరమ్మతులు చేసి వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ కార్మికులకు ఇవ్వాల్సిన సామాగ్రిని అందజేయాలని తెలియపరిచారు.


ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, మాజీ కౌన్సిలర్లు ప్రసాద్, అంబుల వేణు, తోగరు రాజశేఖర్, తాండ్ర శీను, పల్లపురాజు దూడల కిరణ్, హుస్సేన్, పిల్లి కుమార్, రామిళ్ళ మధు, మునీర్, తమ్మిశెట్టి అశోక్, మద్దెల సుధీర్, వెంకటరమణ, రిజ్వాన్, అజ్మీర విజయ్, బుద్ధి మధుసూదన్ రావు, పేరం సందేశ్, వంటేరు కళ్యాణ్, పూర్ణచందర్ నాయక్, మనోజ్, సిద్దు, అనీష్, హైమద్, అజ్జు, రిజ్జు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >
Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >