Posted on 2025-11-19 17:33:30
డైలీ భారత్ న్యూస్, హనుమకొండ: ఇందిరా గాంధీ భారత రాజకీయాల్లో ధైర్యానికి ప్రతీకనీ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురష్కరించుకుని హనుమకొండ డిసిసి భవన్ లో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రయోజనం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్న గొప్ప నాయకురాలన్నారు. సాధారణ ప్రజల జీవితం మెరుగుపడాలనే సంకల్పంతో పనిచేసిశారని గుర్తు చేశారు. మతాల పేరుతో బీజేపీ, ప్రాంతీయత పేరుతో బీఆర్ ఎస్ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో వర్థన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,ఈవీ శ్రీనివాస్ రావు,జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్,ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు ,జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కార్పొరేటర్లు,సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >