| Daily భారత్
Logo




హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్.. చెక్‌ పెట్టిన పోలీసులు

News

Posted on 2025-11-24 12:35:49

Share: Share


హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్.. చెక్‌ పెట్టిన పోలీసులు

డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్: డ్రగ్స్ విక్రయాలపై ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఒకేసారి 3 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎనిమిది మంది డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్ అయ్యారు. నార్సింగి, చందానగర్ , కొల్లుర్ లిమిట్స్‌లో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్న పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి పరిధిలో 4.5 గ్రాముల హెరాయిన్ విక్రయిస్తున్న ఇద్దరిని ఆరెస్ట్ చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి గోపినగర్ వద్ద బస్సులో డ్రగ్స్‌ను తీసుకు వస్తున్న ముఠాను పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ముగ్గురిని మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15 గ్రాముల MDMA, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠా బెంగళూరు నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ ఈవెంట్‌ను టార్గెట్‌గా పెట్టుకొని డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తీసుకువస్తోంది ముఠా. మొత్తం ముగ్గురు సభ్యుల ముఠాను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే కొల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో 42 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >