| Daily భారత్
Logo




హెటిరో డ్రగ్స్ కాలుష్య కొరల్లో దోమడుగు గ్రామం

News

Posted on 2025-11-25 19:28:18

Share: Share


హెటిరో డ్రగ్స్ కాలుష్య కొరల్లో దోమడుగు గ్రామం

కాలుష్య అధికారుల నిర్లక్ష్యం మే గ్రామానికి ప్రమాదమా?

హెటిరో కంపెనీకి వ్యతిరేకంగా మున్సిపల్ కార్యాలయాల వద్ద గ్రామస్తులు ధర్నా

డైలీ భారత్ న్యూస్,పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం లోని గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోనిదోమడుగు గ్రామస్తులు ఈరోజు తమ గ్రామాన్ని కాలుష్యం చేస్తోన్న హెటెరో డ్రగ్స్ యూనిట్ 1 ఇతర మూడు కంపెనీలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్థులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై   కార్యాలయం గుమ్మడిదల మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు, న్యాయం కోసం గట్టిగా నిల దించారు.

ముఖ్య డిమాండ్లు ఆరోపణలు 

కాలుష్యంతో ప్రజారోగ్యం, పశువుల మరణాలు: హెటెరో కంపెనీ వదులుతున్న రసాయన వ్యర్థాల వల్ల గ్రామంలోని ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని, పశువులు మృత్యువాత పడుతున్నాయని, పంటలు నష్టపోతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికార వ్యవస్థల నిర్వీర్యం మూడు నెలలుగా పోరాటం చేస్తున్నా, కాలుష్యంపై అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని, చెరువు నీరు రంగు మారడానికి కారణం తేల్చడంలో వైఫల్యం చెందారని ఆరోపించారు. స్థానిక అధికార వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని, రాజకీయ పక్షాలు కంపెనీ యాజమాన్యానికి మద్దతుగా నిలబడ్డాయని నిరసనకారులు మండిపడ్డారు.

ఈ కంపెనీలను మూసివేయాలని డిమాండ్:

ప్రజలు  పశు సంపదను కాపాడేందుకు, జీవించే హక్కును రక్షించేందుకు కాలుష్యాన్ని వెదజల్లుతున్న హెటెరో డ్రగ్స్ యూనిట్ 1తో సహా మొత్తం నాలుగు కంపెనీలను తక్షణమే మూసివేయాలని రైతులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు. మంచి నీరు, మంచి గాలి మా హక్కుఅని నినాదాలు చేశారు.

అధికారుల స్పందన కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న ఉద్యమకారులతో మాట్లాడుతూ, కాలుష్య నమూనాలను ఇప్పటికే పరీక్షల కోసం పంపించినట్లు తెలిపారు. అయితే, రిపోర్టులు రావడానికి పట్టే సమయం తమ పరిధిలో లేదని పేర్కొన్నారు. చనిపోతున్న పశువులకు పశువైద్య అధికారి ద్వారా పోస్ట్‌మార్టం చేయించేలా చూస్తామని, ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఆరోగ్య శాఖ బృందాన్ని గ్రామానికి పంపిస్తామని హామీ ఇచ్చారు.

మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వద్ద

మున్సిపల్ కమిషనర్ కూడా దోమడుగు ప్రజల సమస్యపై సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు తమ మద్దతు ఉంటుందని ఉద్యమకారులకు హామీ ఇచ్చారు. ఉద్యమకారుల నిర్ణయంపోరాటం అధికారుల హామీలపై ఉద్యమకారులు విశ్వాసం ప్రకటించలేదు. కేవలం మాటలతో సరిపెట్టకుండా, కాలుష్యం సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు తమ పోరాటాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. కంపెనీల మూసివేత మాత్రమే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు.

ధర్నాలో పాల్గొన్న ప్రముఖులు

ఈ నిరసన కార్యక్రమంలో పోరాట కమిటీ కన్వీనర్లు బాల్రెడ్డి, మంగయ్య, కో-కన్వీనర్లు శ్రీనివాస్ రెడ్డి, జయపాల్ రెడ్డి, చింతల శ్రీధర్ , చింతల రాజు, గొంది వెంకటేష్,  ఆనందరెడ్డి, చింతల క్రిష్ణ, దేశపాగ యాదగిరి, గడ్డం కాళేశ్వర్, చింతల సత్యనారాయణ, వీరారెడ్డి, జంగ రమేష్, మద్ది సత్తిరెడ్డి, మద్ది ఎల్లారెడ్డి, మద్ది యాదిరెడ్డి, పలాటి శంకరయ్య, ఏ. కృష్ణరెడ్డి, స్వేచ్ఛ రెడ్డి, మోహనరెడ్డి మరియు మహిళా నాయకురాళ్లు జయమ్మ, పలాటి అనురాధ, అఖిల, అనసూజ, చింతల శ్రీలక్ష్మి, చింతల రూప, వి. సంగీత, వై.కృష్ణారెడ్డి, వీరారెడ్డి, ఎం.కె.రెడ్డి తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంఘీభావం తెలిపినవారు:

ఈ పోరాటానికి టీపీజేఏసీ జిల్లా చైర్మన్ వై. అశోక్ కుమార్, నాయకులు ఆర్. లక్ష్మక్క, ఏ. మానస, ఎం. చంద్రారెడ్డి, మరియు కళాకారుడు ఎల్లయ్య సంఘీభావం ప్రకటించి, గ్రామస్థులకు మద్దతు తెలిపారు.

Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 11:51:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >