| Daily భారత్
Logo




రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

News

Posted on 2025-11-25 19:02:35

Share: Share


రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రం కేజిఆర్ గార్డెన్ లో "ఇందిరా మహిళ శక్తి సంబరాలు–2025" చేవెళ్ల,శంకరపల్లి ,షాబాద్ ,మొయినాబాద్ మండలలకు చందిన 3245 మహిళా సంఘాలుకు 3 కోట్ల 69 లక్షల 21 వేలు 7 వందల 62 రూపాయిలు మహిళలకు వడ్డీ లేని రుణాలను ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలే కేంద్రంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. మహిళలు వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకొని గొప్ప వ్యాపారవేత్తలుగా ఎదగాలని సూచించారు.మన ప్రాంత అభివృద్ధి, మన ప్రజల ఆర్థిక ప్రగతి కోసం ప్రభుత్వం చేపట్టిన అత్యంత ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమాలలో  వడ్డీ లేని రుణాలు ఒకటి అని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల  ఆర్డీఓ చంద్రకళ , గుడిమల్కాపూర్ వైస్ చైర్మన్ కావాలి చంద్రశేఖర్, మార్కెట్ ఛైర్మెన్ పెంటయ్య గౌడ్,  సురేందర్ రెడ్డి , మండల మహిళ సమైక్య అధ్యక్షురాలు కోట లక్ష్మీ,మాజీ జేపీటీసీ కాలే శ్రీకాంత్ , చైర్మన్ ప్రతాప్ రెడ్డి , వెంకట్ రెడ్డి,సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, వీరేందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి , కృష్ణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ,నాలుగు మండలాల ఏపీఎంలు ,మండల మహిళ సమైక్య అధ్యక్షురాలు, పార్టీ నాయకులు, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు...

Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 11:51:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >