| Daily భారత్
Logo




నేటి సమాజంలో మహిళలు గృహహింస, వరకట్న కేసుల కంటే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి వ్యక్తిగత భద్రతను కోల్పోతున్నారు

News

Posted on 2025-11-25 17:33:03

Share: Share


నేటి సమాజంలో మహిళలు గృహహింస, వరకట్న కేసుల కంటే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి వ్యక్తిగత భద్రతను కోల్పోతున్నారు

మహిళ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వక్తల  వెల్లడి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ప్రస్తుత సమాజంలో గృహహింస,వరకట్న కేసులు కాస్త వరకు తగ్గుముఖం పట్టినప్పటికీ సైబర్ నేరగాళ్ల వేధింపుల బారిన మహిళలు,పురుషులు ఎక్కువగా బాధపడుతున్నారని ప్రముఖ వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు.. అనవసర యాప్ ల వాడకం వ్యక్తిగత సమాచారాన్ని మొబైల్ లో ఉంచడం ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేశారు.. ఎవరికి వారు ఇబ్బందులు పడకుండా ఉండడం వారి చేతుల్లోనే ఉంటుందని మహిళా హింస వ్యతిరేక దినోత్సవ సందర్భంగా వారు పేర్కొన్నారు..స్త్రీ శక్తి ఎంతో గొప్పదని కానీ ఆ శక్తిని మనం సద్వినియోగం  చేసుకోవాలని సూచించారు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడిలో గల న్యూ అంబేద్కర్ భవన్ లో   స్నేహ సొసైటీ ఫర్ రూరల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సఖి వన్ స్టాప్ సెంటర్, మహిళా, శిశు ,దివ్యాంగుల, వయో వృద్ధుల, ట్రాన్స్ జెండర్ సంక్షేమ శాఖ నిజామాబాద్  ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ హింస వ్యతిరేఖ దినోత్సవ నిర్వహించారు.. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ నేటి ప్రస్తుత సమాజంలో ఎక్కువగా గృహహింస లాంటి కేసులు చాలావరకు తగ్గుముఖం పట్టినప్పటికీ డిజిటల్ వయోలెన్స్ అలాగే సైబర్ క్రైమ్ నేరగాళ్ల వేధింపులతో ఎక్కువమంది మహిళలు యువతులు అలాగే లింగ వివక్ష లేకుండా మగవారు సైతం తీవ్ర ఇబ్బందుల బారిన పడుతున్నారని తెలిపారు.. అలాగే ఎక్కువగా సోషల్ మీడియా వాడడం వల్ల తమ వ్యక్తిగత విషయాలకు సంబంధించి తమ వ్యక్తిగత ఫోటోలు సైతం బయటకు రావడం ద్వారా వారు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ లకు సైతం పాల్పడుతున్న ఘటనలు సైతం కొక్కొల్లులుగా ఫిర్యాదులు రావడం జరుగుతుందని తెలిపారు.. ఎప్పుడైనా తమ వ్యక్తిగత సమాచారాన్ని ఫోటోలను అనవసర యాప్లను ఓపెన్ చేయడము లాంటివి చేయవద్దని సూచించారు.. మన భారతదేశంలో ఎక్కువగా మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు.. కానీ అలాంటి స్త్రీ శక్తిని మనం సద్వినియోగం చేసుకోవడం లేదని వారు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బసవ రెడ్డి మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం తాను పోలీస్ శాఖలో విధులు చేపట్టిన సమయంలో ఎక్కువగా వరకట్న వేధింపుల కేసులు, ఇతర కేసులు ఎక్కువగా వచ్చేవి అని కానీ ప్రస్తుతం అవి తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రస్తుతం ఎక్కువగా సోషల్ మీడియా డిజిటల్ అరాస్మెంట్ లాంటి కేసులు ఎక్కువగా చూడడం జరుగుతుందని తెలిపారు. అలాగే సోషల్ మీడియా సోషల్ వాట్సాప్ ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ ఇలాంటి ఎన్నో రకాల ఫైల్స్ ఓపెన్ చేయడము పిల్లలకు మొబైల్ ఫోన్స్ ఇవ్వడం అలాగే ఉద్యోగులు మారుతున్న కాలానుగుణంగా మహిళలు పురుషులు కలిసి ఒకే చోట పని చేయడము అలాగే ప్రేమ మరియు కో ఎడ్యుకేషన్ లో యువత కలిసి తిరగడము ప్రేమ ఎడ్యుకేషన్ ఫోన్స్ ఎక్కువ వాడడం వల్ల ఇలాంటి డిజిటల్ వేధింపుల కేసులు నమోదు కావడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికపై ఖచ్చితంగా నిఘా ఉంచాలని సూచించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఎస్ కిరణ్ కుమార్ , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి .రాజశ్రీ స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య, మహిళా కమిషన్ సభ్యురాలు సూదాం లక్ష్మి లు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఎక్కువగా మహిళలు శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారని తెలిపారు.. అయితే ఎక్కువగా మహిళల్లో డిజిటల్ ఎమోషన్ లైంగిక వేధింపులు, ఆర్థిక లావాదేవీల వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం అసలు ఏ రకంగా చెప్పినప్పటికీ చూస్తున్న పరిస్థితులను బట్టి ఎక్కువగా మొబైల్ ఫోన్లు వాడడం మరియు అనవసర యాప్లు వాడకం, తమ వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్లో ఉంచడం ద్వారా ఆ వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరడం ద్వారా ఫోటోలు మార్ఫింగ్ అనేటివి చాలా జరుగుతున్నాయని తెలిపారు ఎప్పుడైతే ఫోటో మార్ఫింగ్ లు ఇలాంటివి జరిగినప్పుడు కుటుంబ కలహాలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బిగుసుకు పోతున్నారని వారు తెలిపారు. ప్రస్తుతం వస్తున్న ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తున్న వీడియోలు ఫోటోసు ఏది నిజం ఏది అబద్దం అనేది తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏది ఏమైనా ఫోన్స్ లో వాడకము, వాటిలో తమ వ్యక్తిగత సమాచారాన్ని ఉంచడము ఇతర యాప్ లు వాడడం తక్కువ చేసుకోవాలని సూచించారు.. అలాగే 24 గంటలపాటు ఆ పని ఈ పని ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ స్నేహ సొసైటీ ప్రాజెక్టు నిర్వహిస్తున్న సఖి వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది 24 గంటలు సేవలందించడం జరుగుతుందని తెలిపారు. సఖి వన్ స్టాప్ సెంటర్ 2017లో ఏర్పడినప్పటికీ గత 8 సంవత్సరాలుగా పేద ధనిక ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండ చట్ట ప్రకారంగా బాధిత మహిళలకు నిర్విరామంగా  సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి ప్రభుత్వ అధ్యక్షత వహించగా, శ్రీలత, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, గైనకాలజిస్ట్ డాక్టర్ అరుణ రేఖ సఖి వన్ స్టాప్ సెంటర్ ,సెంటర్ అడ్మినిస్ట్రేటర్ భానుప్రియ పాల్గొని ప్రసంగించారు. 

ముందు సైబర్ క్రైమ్ డిఎస్పి వెంకటేశ్వరరావు, సిఐ శ్రీనివాసరావు సైబర్ క్రైమ్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజ్ విద్యార్థులు, చివరిగా  స్నేహ సొసైటీ దివ్యాంగ విద్యార్థులు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 11:51:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >