| Daily భారత్
Logo




లైంగిక సమస్యకు మందని నమ్మి.. రూ.48 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

News

Posted on 2025-11-25 23:24:48

Share: Share


లైంగిక సమస్యకు మందని నమ్మి.. రూ.48 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

ఆయుర్వేద వైద్యం పేరుతో టెక్కీని మోసం చేసిన నకిలీ బాబా

"దేవరాజ్ బూటీ" పేరుతో లక్షల్లో దోచుకున్నవైనం

డబ్బు పోవడమే కాకుండా కిడ్నీ సమస్యలు కొనితెచ్చుకున్న బాధితుడు.పోలీసులకు ఫిర్యాదు చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణంగా మోసపోయాడు. లైంగిక సమస్యను నయం చేస్తానని నమ్మించిన ఓ నకిలీ ఆయుర్వేద వైద్యుడి చేతిలో ఏకంగా రూ.48 లక్షలు పోగొట్టుకున్నాడు. డబ్బు పోవడమే కాకుండా, ఆ నకిలీ మందుల కారణంగా కిడ్నీ సంబంధిత సమస్యలను కూడా కొనితెచ్చుకున్నాడు. చివరకు మోసపోయానని గ్రహించిన బాధితుడు శనివారం జ్ఞానభారతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.పోలీసుల కథనం ప్రకారం.. 2023లో వివాహం తర్వాత బాధితుడికి లైంగిక ఆరోగ్య సమస్య తలెత్తింది. మొదట ఓ మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో మే 3న కేఎల్‌ఈ లా కాలేజీ సమీపంలో రోడ్డు పక్కన వేసిన ఓ "ఆయుర్వేదిక్ దవాఖానా" గుడారం అతడి కంటపడింది. అందులో "విజయ్ గురూజీ" గా పరిచయం చేసుకున్న వ్యక్తి, తన దగ్గరున్న అరుదైన మందులతో సమస్యను శాశ్వతంగా నయం చేస్తానని నమ్మబలికాడు.హరిద్వార్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన "దేవరాజ్ బూటీ" అనే మందు కొనాలని సూచించాడు. గ్రాముకు రూ.1.6 లక్షలు ఉంటుందని, యశ్వంత్‌పూర్‌లోని ఓ ఆయుర్వేద స్టోర్‌లో ఇది దొరుకుతుందని చెప్పాడు. మందు కొనేటప్పుడు ఒంటరిగా రావాలని, డబ్బులు కూడా నగదు రూపంలోనే చెల్లించాలని షరతులు పెట్టాడు. అతని మాటలు నమ్మిన టెక్కీ ఆ మందును కొన్నాడు.ఆ తర్వాత "భావనా బూటీ తైలం" పేరుతో మరో మందును గ్రాముకు రూ.76,000 చొప్పున అంటగట్టాడు. చికిత్స మధ్యలో ఆపితే వికటిస్తుందని బెదిరించడంతో, బాధితుడు భార్య, తల్లిదండ్రుల నుంచి రూ.17 లక్షలు, బ్యాంకు నుంచి రూ.20 లక్షల లోన్ తీసుకుని మరీ డబ్బు చెల్లించాడు. ఇలా మొత్తం రూ.48 లక్షలు సమర్పించుకున్నా, అతని సమస్య ఏమాత్రం తగ్గకపోగా కొత్తగా కిడ్నీ సమస్యలు మొదలయ్యాయి.ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. "రూ.48 లక్షలు ఖర్చు చేశాడా అతను మోసపోవడానికి అర్హుడే" అంటూ ఓ ప్రముఖ కార్డియాలజిస్ట్ వ్యాఖ్యానించగా, చదువుకున్న వారు కూడా ఇలాంటి మోసాల బారిన పడటంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >