Posted on 2025-11-26 20:04:10
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పాలనాధికారి టి.వినయ్ కృష్ణారెడ్డి సమక్షంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. భారతదేశ ప్రజలమైన మేము దేశ సార్వభౌమ్య, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు, పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధన - వీటి స్వాతంత్య్రమును, అంతస్తులోనూ, అవకాశంలోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు, అందరిలోనూ వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను, అఖండతను కాపాడేందుకు అంకిత భావంతో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >