| Daily భారత్
Logo




గుప్త నిధుల పేరుతో మోసం చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు

News

Posted on 2025-11-26 20:37:13

Share: Share


గుప్త నిధుల పేరుతో మోసం చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు

గుప్త నిధుల పేరుతో  రూ.4 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వామీజీ వేషంలో భారీ మోసం... ​స్వామీజీ వేషధారణలో అమాయక ప్రజలను నమ్మించి, ఇంట్లో నిధులు ఉన్నాయని, వాటిని బయటకు తీస్తామని చెప్పి బెదిరించి భారీగా డబ్బులు కాజేసిన సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

చందుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.వెంకటేశ్వర్లు ఈ వివరాలను వెల్లడించారు. ​సుమారు రెండు నెలల క్రితం, సెప్టెంబర్ రెండో వారంలో, పెద్దూరు గ్రామానికి చెందిన మేకల నరేష్ అనే వ్యక్తి స్వామీజీ వేషంలో కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన దుగ్గు వేణు ఇంటికి వచ్చాడు. 

అతనికి పిల్లలు లేరని తెలుసుకున్న నరేష్, ఇంట్లో ఎవరో మంత్రాలు చేశారని, అందుకే పిల్లలు కలగడం లేదని నమ్మించాడు. తాయత్తులు కడతానని చెప్పి తొలి విడతగా రూ. 3,000 తీసుకున్నాడు. ​

వేణు కుటుంబం డబ్బు ఇవ్వడంతో, ఇంకా ఎక్కువ లాగాలని పథకం పన్నిన నరేష్, వారి ఇంట్లో బంగారు నిధి దాగి ఉందని, దానిని బయటకు తీసే శక్తి తన వద్ద ఉందని నమ్మించాడు. 

తన మిత్రుడైన బాబాను పిలిపించి పూజలు చేస్తానని చెప్పి, వేణు నుంచి ముందుగా రూ. 50,000 తీసుకున్నాడు.​ఆ తర్వాత నరేష్‌తో పాటు పెద్దూరుకు చెందిన కడవంచ ప్రసాద్, సిరిసిల్ల చంద్రంపేటకు చెందిన సదుల దేవేందర్ కలిసి రాత్రిపూట వేణు ఇంటికి వచ్చారు. 

ఇంట్లో పూజలు చేసినట్టు నటించి, నిధి కోసం గుంత తవ్వినట్టుగా చేసి, అందులో ఒక చిన్న విగ్రహం లాంటిది పెట్టి, అది కొద్దిగా కనిపించేలా చేసి వెంటనే మూసివేశారు. ఆపై, "మీ ఇంట్లో నిధికి నాగబంధం ఉన్నది. మనం ఇలానే తవ్వితే మన ప్రాణాలు పోతాయి" అని బెదిరించారు. 

నాగబంధం తొలగించాలంటే అఘోరాను పిలిపించి క్షుద్ర పూజ చేయాలని, ఇందుకోసం మరో రూ. 3,40,000 ఖర్చు అవుతుందని, లేదంటే నాగబంధం విడుదలయ్యి ఇంట్లో వారందరికీ అరిష్టం జరిగి ప్రాణ నష్టం జరుగుతుందని వేణు కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. 

భయపడిన వేణు ఆ మొత్తాన్ని వారికి చెల్లించడానికి అంగీకరించాడు.​నాలుగు రోజులకు డబ్బు ఇచ్చిన తర్వాత, ముగ్గురు నిందితులు చంద్రంపేటకు చెందిన సదుల రాజేశం అనే మరొక వ్యక్తిని అఘోరా వేషంలో తీసుకొని వచ్చారు.

పూజ చేసినట్టు నటించి, గుంత తవ్వుతుండగా, వారు వెంట తెచ్చుకున్న కోరలు తీసిన పామును ఆ గుంతలో వేశారు.ఆ పాము సదుల దేవేందర్‌ను కరిచినట్టుగా నమ్మించి, దేవేందర్ రక్తం కక్కుతున్నట్టుగా నటించాడు. 

అతన్ని అర్జెంట్‌గా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ప్రాణం పోతే మీ ఇంటికే ప్రమాదం, మీపైనే కేసు అవుతుంది అంటూ బెదిరించారు.భయపడిన వేణు వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లమని కోరగా తమ దగ్గర డబ్బులు లేవని చెప్పి, అదనంగా మరో రూ. 15,000 ఇవ్వాలని బెదిరించి వసూలు చేశారు.మొత్తం రూ. 4,08,000 కాజేసి, దేవేందర్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్టుగా నటించి అక్కడి నుంచి ఉడాయించారు.​

ఆ తర్వాత నరేష్ ఎంత ప్రయత్నించినా దొరకకపోవడంతో, మోసపోయానని గ్రహించిన బాధితుడు దుగ్గు వేణు, తేదీ 25.11.2025న కోనరావుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు

దర్యాప్తులో భాగంగా, నిజామాబాద్ గ్రామ శివారులోని వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద నిందితులు మేకల నరేష్, కడవంచ ప్రసాద్, సదుల దేవేందర్ మళ్లీ గ్రామంలో సంచరించడానికి రాగా, ముందస్తు సమాచారం మేరకు ఎస్.ఐ. ప్రశాంత్ రెడ్డి స్టేషన్ సిబ్బంది మరియు సీసీఎస్ టీం వారితో కలిసి ముగ్గురిని అరెస్ట్ చేశారు.

వీరి వద్ద నుండి రూ. 3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.​ఈ కేసు ఛేదించిన ఎస్.ఐ. ప్రశాంత్ రెడ్డి స్టేషన్ సిబ్బంది మరియు సీసీఎస్ టీం వారిని సీఐ వెంకటేశ్వర్లు అభినందించారు.​ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు.

 "ఎవరైనా వ్యక్తులు స్వామీజీ వేషంలో వచ్చి మీ ఇంట్లో నిధి ఉన్నదని గానీ, లేదా ఇతర బలహీనతలను ఆసరాగా చేసుకుని నమ్మించడానికి ప్రయత్నం చేసినట్లయితే, ప్రజలు ఎవరూ వాటిని విశ్వసించరాదు" అని కోరారు. 

అలాంటి వారెవరైనా గ్రామంలో సంచరిస్తున్నట్టు సమాచారం ఉన్నట్లయితే, వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని సీఐ వెంకటేశ్వర్లు కోరారు.

Image 1

రాజన్న ఆలయ గోశాలకు వరిగడ్డి వితరణ

Posted On 2026-04-25 22:35:25

Readmore >
Image 1

పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల

Posted On 2026-04-25 22:28:14

Readmore >
Image 1

కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు

Posted On 2026-04-25 21:27:36

Readmore >
Image 1

ఆర్థిక మోసం కేసులో మంగ్లీ పాత్రపై దర్యాప్తు ముమ్మరం

Posted On 2026-04-25 20:38:22

Readmore >
Image 1

మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం

Posted On 2026-04-25 19:28:22

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..

Posted On 2026-04-25 17:10:44

Readmore >
Image 1

కవిత "పాంచజన్యం" హామీలు

Posted On 2026-04-25 13:59:56

Readmore >
Image 1

కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు

Posted On 2026-04-25 11:37:20

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర సేన ( టిఆర్ఎస్ )

Posted On 2026-04-25 11:28:47

Readmore >
Image 1

కలెక్టరేట్ లో కీచకుడు

Posted On 2026-04-25 10:11:42

Readmore >