Posted on 2025-12-03 15:33:21
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఈ నెల 12వ తేదీన యూవి కెన్,యూవి ఫౌండేషన్ వ్యవస్థాపకులు దొడ్డి సృజన్ కుమార్ అన్నారు. నవీపేట మండలం జన్నేపల్లి లో గల శ్రీ మహేశ్వరి గార్డెన్స్ లో మాజీ క్రికెట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ పుట్టినరోజు సందర్బంగా పలు సామజిక సేవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని దానిలో క్యాన్సర్ స్క్రినిoగ్, బ్లడ్ డొనేషన్ కాంప్, కంటి పరీక్షలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బాగ్స్, నోటుబుక్స్, స్టేషనరీ పంపిని, ఆలాగే వివిధ రంగ్గాల్లో విశేష సేవలoదించిన పలువురికి సేవా భారతీ పేరిట అవార్డ్స్ అందచేయడం జరుగుతుందని యూవి ఫౌండేషన్ ఫౌండర్ దొడ్డి సృజన్ తెలిపారు సామజిక సేవ లో తమ సంస్థ ఎప్పడు ముంద్దె ఉంట్టుందని దానిలో భాగంగా డిసెంబర్ 12వ తేదీ మరిన్ని సేవ కార్యక్రమలను నిర్వహిస్తున్నమని ఈ కార్యక్రమంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న మాజీ క్రికట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ అభిమానులు పెద్ద ఎత్తున్న రావడం జరుగుతుందని వివరించారు. వారితో పాటు తెలంగాణ లో సామాజిక సేవ అందిస్తున్న సమాజసేవకులను ఆహ్వానించడం జరిగిందన్నారు
ఈ సందర్బంగా కార్యక్రమనికి సంబందించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో యూవి ఫౌండేషన్ ప్రతినిధులు అనిల్,రాజేష్, రాకేష్, ప్రశాంత్, ఆకాష్, సన్నీ, నరేష్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >