Posted on 2025-12-05 16:52:10
డైలీ భారత్ న్యూస్, నల్గొండ: రూ.20 వేలు లంచం తీసుకుంటూ నల్లగొండ జిల్లా చండూర్ మండల డిప్యూటీ తాసీల్దార్ చంద్రశేఖర్ శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. గట్టుప్పల్ మండలం తెరట్‌పల్లి గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడి దివంగత తండ్రికి చెందిన భూమికి సంబంధించి గతంలో జారీ చేసిన మ్యుటేషన్ ప్రొసీడింగ్స్, సంబంధిత పత్రాలను ఫిర్యాదుదారునికి అందజేయడానికి డిప్యూటీ తాసీల్దార్ లంచం డిమాండ్ చేశాడు. హైదరాబాద్ నగరంలోని బాలాపూర్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో లంచం తీసుకుంటుండగా చంద్రశేఖర్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారు అతడిని నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా కోర్టు అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
#acb #Nalgonda
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >