Posted on 2025-12-23 11:27:05
డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్ / మహేశ్వరం నాగారం : ప్రజాధరణ పొందేలా ప్రజా ప్రతినిధులు వ్యవహరించాలని అఫ్జల్ అన్నారు. మహేశ్వరం మండలం నాగారం గ్రామ పంచాయతీ పాలక వర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న మహ్మద్ అఫ్జల్ ఖాన్ మాట్లాడుతూ రాజకీయాలలో ప్రజా ప్రతినిధులుగా గెలుపొందిన వారు ప్రజలకు సేవలు అందించే విధంగా వ్యవహరించాలని కోరారు. ప్రజాధరణ పొందిన వ్యక్తులు రాజకీయాలలో రాణిస్తారని అన్నారు. రాజకీయాలలో గెలుపోటములు సహజమని, ప్రజల మధ్య ఉంటే ఎప్పుడూ ఆదరణ ఉంటుందని అన్నారు. ఐదు సంవత్సరాలు నాగారం గ్రామ ప్రజలు అందించిన తీర్పు చారిత్రాత్మకమని ఐదు సంవత్సరాలు గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం సర్పంచ్ బండారి లింగం ముదిరాజ్, ఉప సర్పంచ్ మంచి చంద్రకళ, తో పాటు 1వార్డు మెంబెర్ మల్లెల శ్యామలమ్మ, 2వార్డు కుండే హరీష్, 3వార్డు మహమ్మద్ నయీమ్ ఖాన్, 5వార్డు మహమ్మద్ షాబుద్దీన్ ఖాన్, 6 వార్డు ఘనపురం మహేందర్ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >