Posted on 2025-12-23 14:40:38
డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల స్నేహపూర్వక విధానం మరియు పోలీసుల పారదర్శక పనితీరు విధానం వలన ప్రజలలో పోలీసులపై విశ్వాసం పెరిగింది. జిల్లాలో గ్రామస్థాయిలో విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా విలేజ్ పోలీస్ అధికారి (VPO) వ్యవస్థ బలోపేతం చేసి శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి విద్యార్థినీ,విద్యార్థులకు మాదకద్రవ్యాల వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడంతో పాటుగా జిల్లాలో అవగాహనా ర్యాలీలు నిర్వహించడంతో పాటుగా 2K రన్ నిర్వహించడం జరిగింది.
2025 సంవత్సరంలో మహిళా రక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతూ జిల్లా షీ టీం విద్యసంస్థలలో,మహిళలు పని చేసే ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమాల ద్వారా మహిళల్లో,విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం జరిగింది.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు సైతం పూర్తి స్థాయిలో పోలీస్ సేవలు విస్తరించాలనే ఉద్దేశ్యంతో జిల్లా పోలీస్ కార్యాలయంలోగ్రీవెన్స్ డే, మెసేజ్ యువర్ ఎస్పీ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వీటి ద్వారా బాధితులు,ఫిర్యాదుదారులు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా పోలీస్ అధికారులను సంప్రదిస్తున్నారు. బాధితులకు సత్వర న్యాయం చేకూరడంతో పాటూ పోలీస్ శాఖపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగింది.
2025 సంవత్సరంలో జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రామపంచాయితి ఎన్నికలు విజయవంతం చేయడం జరిగింది.
గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం నేరాలు (14.03%) గణనీయంగా తగ్గడం జరిగింది.
IPC CRIMES:
The below mentioned cases were reported during the years 2024 and 2025 till November.
గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య 13.94% తగ్గడం జరిగింది.
రోడ్ సేఫ్టీ / అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమం:
విద్యార్థులు, వాహనదారులను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని రోడ్డు భద్రతపై క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే, అన్ని శాఖల సమన్వయంతో జిల్లా స్థాయి రోడ్డు భద్రత అవగాహన సమావేశం కూడా నిర్వహించడం జరిగింది.
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతీ పోలీస్ స్టేషన్ ప్రమాదాల నివారణకు వాహనాల వేగాన్ని తగ్గించడానికి ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో సైన్ బోర్డ్స్, రబ్బర్ స్ట్రిప్స్ ,అప్రోచ్ రోడ్స్ వద్ద స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
షీ టీమ్ మరియు భరోసా సిబ్బంది పాఠశాలలు, కళాశాలలు మరియు మహిళలు పనిచేసే ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వలన బాధితులు ముందుకు వచ్చి సంబంధిత నిందితులపై ఫిర్యాదులు చేయడంతో, ఈ సంవత్సరంలో కేసుల సంఖ్య పెరిగింది.
ప్రాపర్టీ రికవరీ: 2024లో 428 ప్రాపర్టీ కేసులు నమోదు కాగా, వాటిలో 273 కేసులు చేధించి రూ.4853205=00 విలువైన ఆస్తి రికవరీ చేయడం జరిగింది. రికవరీ శాతం(31.58%). 2025 సంవత్సరంలో 339 ప్రాపర్టీ కేసులు నమోదు కాగా, వాటిలో 144 కేసులు చేధించి రూ. 39,53,137=00 విలువైన ఆస్తి రికవరీ చేయడం జరిగింది. రికవరీ శాతం(31.27%).
CEIR: జిల్లాలో వివిధ సందర్భాలలో దొంగిలించబడిన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ సిఈఐఆర్ అప్లికేషన్ ద్వార ఈసంవత్సరం 799 మొబైల్ ఫోన్స్ గుర్తించి 611 ఫోన్స్ బాధితులకు అప్పజెప్పడం జరిగింది.ఇప్పటివరకు జిల్లాలో 2218 ఫోన్స్ బాధితులకు అప్పజెప్పడం జరిగింది.83% ఫోన్స్ రికవరీతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం జరిగింది.
అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్న నిందితులపై జిల్లా సైబర్ బృందం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ చాకచక్యంగా దర్యాప్తు చేపట్టింది. ఫలితంగా మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలలో నిందితులను అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయడం జరిగింది.
సమాజంలో నేరాలకు పాల్పడిన ఎవరూ శిక్షల నుండి తప్పించుకోవద్దని, పోలీసు శాఖ, ప్రాసిక్యూషన్ విభాగం సమన్వయంతో వ్యూహాత్మకంగా విచారణలు చేపట్టి, పటిష్టమైన న్యాయ నిరూపణ ద్వారా ఈ సంవత్సరం 95 కేసులలో నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవడం జరిగింది. 3 హత్య కేసులలో నిందితులకు జీవితకాల శిక్ష విధించడం జరిగింది.
Finger Print Bureau (Clues Team):
2024 సంవత్సరంలో క్లూస్ టీమ్ 175 కేసులకు గానూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 32 కేసులను చేధించి నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది.
2025 సంవత్సరంలో క్లూస్ టీమ్ 104 కేసులకు గానూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 14 కేసులను చేధించి నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది.
మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ (MSCD) సహయంతో 27,599 మందిని తనిఖీ చేయడం జరిగింది. లైవ్ స్కానర్ సహాయంతో 796 మంది అనుమానిత వ్యక్తులను, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన 41 మందిని మరియు 757 మంది నేరస్తుల ఫింగర్ ప్రింట్స్ తీసుకుని తనిఖీ చేయడం జరిగింది.
కోర్ట్ వర్టికల్: పెండింగ్ నాన్-బెయిలబుల్ వారంట్లు 388 ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది.
రౌడీ షీట్స్: జిల్లాలో తరుచు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై మొత్తంగా 121 రౌడీ షీట్లు అమలులో ఉన్నాయి.
పీడీ యాక్ట్: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా పరిధిలో 2025 సంవత్సరంలో 04 పీడీ యాక్టులు నమోదు చేయడం జరిగింది.
డయల్-100 కాల్ ద్వారా జిల్లాలో ఏ ప్రాంతంనుండైనా నేర సమాచారం అందుకున్న 5 నిమిషాల వ్యవధిలో బ్లూ కోల్ట్, పెట్రో కార్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది.
గల్ఫ్ ఛీటింగ్ కేసులు: గల్ఫ్ కు పంపిస్తానని మోసం చేసిన 38 కేసులు నమోదు చేసి 28 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అంతే కాకుండా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి మొబైల్ నెంబర్ ను క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం చేసి గల్ఫ్ ఏజెంట్లను సంప్రదించే ముందు వారి సమాచారం కోసం ఇన్స్పెక్టర్ నెంబర్ ను సంప్రదించాల్సిందిగా అవగాహన కల్పించడం జరిగింది.
అక్రమ వడ్డీ: అధిక వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై 12 కేసులు నమోదు చేయడం జరిగింది.(12 కేసుల్లో నిందితులకు 1,80,000/- ) జరిమానా విధించడం జరిగింది.
పీడీఎస్ రైస్: పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై 55 కేసులు నమోదు చేసి 76 మందిని అరెస్ట్ చేసి 438 క్వింటాళ్ళ పీడీఎస్ రైస్ ను సీజ్ చేయడం జరిగింది.
గేమింగ్ యాక్ట్/ జూదం: గేమింగ్ యాక్ట్/ జూదంలో 44 కేసుల్లో 249 మందిపై కేసులు నమోదు చేసి రూ=4,88,060/- సీజ్ చేయడం జరిగింది.
2025 సంవత్సరంలో గంజాయి నిందితులపై 02 హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది.
ANTI DRUG CLUBS: మాదకద్రవ్యాల నివారణే లక్ష్యంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడం జరిగింది. వీటితో పాటు పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.
DRUG TEST WITH URINE KITS: అనుమానిత వ్యక్తుల వద్ద, గతంలో గంజాయి కేసులలో ఉన్న నిందుతుల వద్ద గంజాయి నమూనాలు గుర్తించడానికి జిల్లాలో DRUG TEST WITH URINE KITS అన్ని పోలీస్ స్టేషన్ లలో అందుబాటులోకి తీసుకువచ్చి విసృతంగా టెస్ట్ లు నిర్వహించడం జరిగింది.
5K RUN & 2K RALLY FOR YOUTH: మాదకద్రవ్యాల రహిత రాజన్న సిరిసిల్ల జిల్లాగా మార్చేందుకు పాఠశాల, కళాశాల విద్యార్థులతో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు 5కే రన్ & 2కే ర్యాలీ నిర్వహించడం.
CCTVs Installation:
జిల్లాకు వచ్చి పోయే వాహనాలను గుర్తించడానికి జిల్లా సరిహద్దుల్లో హై రెసుల్యూషన్ ఆటోమేటిక్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది.
షీ టీమ్:
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన షీ టీమ్ విద్యా సంస్థలు, బస్టాండ్ లు, మహిళలు పని చేసే ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో నిరంతరం పోకిరీలపై నిఘా ఉంచుతూ మహిళా చట్టాలపై వివిధ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
మీ కోసం:ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు సైబర్ సెక్యూరిటీ, షీ టీమ్, రోడ్ సేఫ్టీ, గంజాయి, ఆన్లైన్ చీటింగ్లు, గుట్కా, జూదం మరియు మహిళల భద్రత, కమ్యూనిటీ పోలీసింగ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
గ్రీవెన్స్ డే & మెసేజ్ యువర్ ఎస్పీ: ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడానికి గ్రీవెన్స్ డే, మెసేజ్ యువర్ ఎస్పీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజల వద్ద నుండి 924 ఫిర్యాదులు స్వీకరించి చట్ట ప్రకారం న్యాయం చేయడం జరిగింది.
హెల్త్ క్యాంప్: జిల్లాలో నిరంతరం విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది ఆరోగ్యం పట్ల ఆశ్రద్ధ వహించకూడదని మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి జిల్లాలోని పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది.
రక్తదాన శిబిరం: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 450 మంది పోలీసులు, యువకులు పాల్గొని రక్తదానం చేశారు.
కమ్యూనిటి పోలీసింగ్ :శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఆపదలో ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడడం పోలీస్ శాఖ కర్తవ్యమని భావించి వరదల్లో చిక్కుకున్న ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాం.
జిల్లాలో ఈ సంవత్సరం భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న సుమారు 38 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది.
భారీ వర్షాలు, వరదల కారణంగా గంభీరావుపేట మండలం నర్మాల లోని ఎగువ మానేరు జలాశయం వద్ద పశువుల కాపర్లు చిక్కుకపోగా వెంటనే స్పందించి, సంబంధిత శాఖల సమన్వయంతో తక్షణ సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలు చేరవేసి, ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా 8 మందిని సురక్షితంగా రక్షించాము.
అదే విధంగా గంభీరావుపేట మండలం లింగన్నపేట, మల్లారెడ్డిపేట గ్రామాలలో వరదల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను NDRF, SDRF బృందాలతో సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షితంగా రక్షించడం జరిగింది.
2025 GRAMAPANCHAYATH ELECTIONS: 2025 గ్రామపంచాయతి ఎన్నికలు మూడు విడుతలో జరుగగా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇన్సిడెంట్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో స్వేచ్చగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు సుమారు 900 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పకడ్బందీగా ప్రణాళికలు సిద్దం చేసి విజయవంతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది.
ELECTION CASES, CASH, OTHER SEIZED DETAILS DURING ELECTIONS.
1. Election Violations Cases – 13
2. Seized Net Cash – Rs 29,05,720.=00
3. Liquor Cases – 102, Seized Liquor 1577.36 ltrs.
5. Bind Over Cases and Persons -226 Cases 789 Persons.
FUTURE VISION:
1.జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తాము.
• జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి, ఆరోగ్య పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన మందులను అందజేస్తాము.
• జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణకు మద్దతుగా ప్రధాన కూడళ్లలో మరియు జిల్లా సరిహద్దుల్లో ANPR /సీసీటీవీ కెమెరాల సంఖ్యను పెంచుతూ, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. అదనంగా, వాహన తనిఖీలు నిర్వహించే పోలీసు సిబ్బందికి బాడీ వోర్న్ కెమెరాలు అందించి, పారదర్శకతను పెంచడంతో పాటు అనూహ్య సంఘటనలను నివారించే చర్యలు చేపడుతాము.
• జిల్లాను మాదక ద్రవ్యరహితంగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, గంజాయి సేవించే వారిని గుర్తించి, కౌన్సెలింగ్ కార్యక్రమాల ద్వారా మార్గనిర్దేశం చేస్తూ, విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము.
• దొంగతనాల కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లాలో నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తున్నాం. అన్ని కోణాల నుంచి కేసులను సమగ్రంగా దర్యాప్తు చేసి, కేసులను ఛేదిస్తూ, 100 శాతం రికవరీ సాధిస్తాం.
• సాంకేతికతను వినియోగిస్తూ సైబర్ నేరాలు, క్లూస్ టీమ్‌లు, CCTNS పై పోలీసు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, దర్యాప్తులను వేగవంతం చేసి నేరాలపై పూర్తి స్థాయిలో నియంత్రణ సాధిస్తాం.
• రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగింది. జిల్లాలో బ్లాక్ స్పాట్లను గుర్తించి, R&B, మున్సిపాలిటీలు మరియు సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపడుతాము.
2026 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ, స్నేహపూర్వక పోలీసు విధానాన్ని అవలంబిస్తూ, రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ బాధ్యతాయుతంగా, జవాబుదారితనంతో, పారదర్శకంగా సేవలందిస్తూ ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణ కోసం అనుక్షణం పనిచేస్తామని తెలుపుతూ జిల్లా ప్రజలకు మా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >