| Daily భారత్
Logo




చిట్యాల మండల కేంద్రంలోని వైన్స్‌లపై ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా అఖిలపక్ష ఆందోళన

News

Posted on 2025-12-23 17:43:59

Share: Share


చిట్యాల మండల కేంద్రంలోని వైన్స్‌లపై ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా అఖిలపక్ష ఆందోళన

విద్యార్థులను మద్యపానానికి బానిసలు చేస్తే ఊరుకునేది లేదు – నాయకుల హెచ్చరిక

డైలీ భారత్ న్యూస్, చిట్యాల:భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మండల కేంద్రంలో ఉన్న లక్ష్మీనరసింహ వైన్స్ కారణంగా జూనియర్ కాలేజీ విద్యార్థులు మద్యపానానికి బానిసలవుతున్నారని ఆరోపిస్తూ,తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ VCK యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్‌లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్, రాష్ట్ర నాయకులు – వరంగల్ పార్లమెంట్ కాంటెస్ట్ ఎంపీ అభ్యర్థి ఎస్‌ఎఫ్‌కే సాగర్, TRP యూత్ జిల్లా అధ్యక్షులు బండి సునిల్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ –

రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యావ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైందని, నిబంధనల ప్రకారం విద్యాసంస్థలకు కనీసం ఒక కిలోమీటర్ దూరంలో ఉండాల్సిన వైన్ షాపులు మండల కేంద్రాల్లో, కాలేజీలకు అతి సమీపంలో కొనసాగడం వల్ల విద్యార్థులు మద్యపానానికి అలవాటుపడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల విద్యార్థినీలు, మహిళలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.వైన్ షాప్ అనుమతుల విషయంలో ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించి, చిట్యాల మండల కేంద్రంలో ఉన్న వైన్ షాపులను ఊరికి దూరంగా తరలించడంతో పాటు సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్షాల తరఫున డిమాండ్ చేశారు.

ధర్నా అనంతరం పోలీసులు నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీధర్, విష్ణు, మహేష్ కుమార్, కిట్టు, సిద్ధు, చింటూ, మహేష్తో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, విద్యార్థినీలు పాల్గొన్నారు.

Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >