Posted on 2025-12-27 09:23:11
డైలీ భారత్, మిరుదొడ్డి మండలం (సిద్ధిపేట): జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అందె గ్రామంలో గురువారం రాత్రి “కనువిప్పు అవగాహన కార్యక్రమం” ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక సబ్‌ఇన్స్పెక్టర్ సమతా , గ్రామ సర్పంచ్ కడారి యాదగిరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
పోలీస్ కళాజాత బృందం, తెలంగాణ సాంస్కృతిక శాఖ కళాబృందం ప్రదర్శించిన సందేశాత్మక నాటికల ద్వారా మూఢనమ్మకాలు, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వినియోగం, మహిళల భద్రత, యువతలో చట్ట అవగాహన వంటి అంశాలపై ప్రజలకు చైతన్యం కల్పించారు.ఈ కార్యక్రమం లో గ్రామ ఉపసర్పంచ్ మాట్లా పర్శరాములు, ప్రవీణ్ వరాల రాజకుమార్, మాజీ ప్రజా ప్రతినిధులు లింగం శంకర్, కళాకారులు రవి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.గ్రామ ప్రజలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >
కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >