| Daily భారత్
Logo




గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం : జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

News

Posted on 2025-12-29 19:19:49

Share: Share


గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం : జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తుందని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం షాబాద్ మండలం అప్పరెడ్డిగూడ గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ పోలేపల్లి సందీప్ గౌడ్,ఉపసర్పంచ్ శరత్ కుమార్ తో పాటు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచులు ప్రజలతో సమన్వయంగా పని చేస్తూ ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ సందీప్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు.గ్రామంలోని మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం, మరియు ఇతర అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని నూతన పాలకవర్గం ముక్తకంఠంతో ఆయన హామీ ఇచ్చింది.ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్  మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్పంచులు గుండాల అశోక్, ఈగ ప్రభాకర్ రెడ్డి, స్వరూప మహేందర్ గౌడ్,కుమ్మరి లావణ్య చెన్నయ్య, తాళ్ల మాణిక్యం గౌడ్,షాబాద్ ఉపసర్పంచ్ దండు రాహుల్ గుప్తా, సర్దార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంజీవరెడ్డి ,మాజీ సర్పంచులు బేగరి ఆంజనేయులు, బండ సతీష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, సుభాష్ రెడ్డి , గంధం గౌరీశ్వర్ ముదిరాజ్, శేఖర్, శాగంటి శ్రీనివాస్, విష్ణువర్ధన్ రెడ్డి, మైపాల్ రెడ్డి, రాజు, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ,ఆంజనేయులు, శ్రీకాంత్ రెడ్డి, కావలి శ్రీరాములు, సత్తయ్య, గ్రామ పెద్దలు,నాయకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >