| Daily భారత్
Logo




దారుణం... కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి

News

Posted on 2025-12-30 11:44:50

Share: Share


 దారుణం... కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి

డైలీ భారత్, గద్వాల:గద్వాల జిల్లాలో కన్నతండ్రే కూతురిపై అత్యాచారానికి పాల్పడి, గర్భవతిని చేశాడు. ఈ ఘోరానికి మొదటి భార్య కూడా సహకరించడం విచారకరం. బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండగా విషయం బయటపడింది. పోలీసులు నిందితుడితో పాటు సహకరించిన మొదటి భార్యను అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సమాజం తలదించుకునేలా, మానవత్వం మంటగలిసిపోయేలా గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ దారుణ ఘటన విస్మయానికి గురిచేస్తోంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కామంతో కళ్లు మూసుకుపోయి.. వావివరసలు మరచి కన్నబిడ్డపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దారుణానికి ఆ వ్యక్తి మొదటి భార్య కూడా తోడవ్వడం, ఒక మహిళ అయి ఉండి తోటి ఆడపిల్లపై జరుగుతున్న అన్యాయాన్ని ఆపాల్సింది పోయి దగ్గరుండి సహకరించడం విచారకరం. కంచే చేను మేసిన చందంగా.. రక్షణగా ఉండాల్సిన ఇల్లే ఆ బాలికకు నరకప్రాయంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ...

నిందితుడికి ఇద్దరు భార్యలు కాగా.. మెుదటి భార్యకు పిల్లలు పుట్టకపోవటంతో ఆమె చెల్లిని రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు నలుగురు సంతానం కాగా.. ఆ తర్వాత మెుదటి భార్యకు సైతం ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే రెండో భార్యకు పుట్టిన 16 ఏళ్ల కూతురిపై అతడు కన్నేశాడు. కుటుంబ సభ్యులంతా కూలి పనులకు వెళ్ళిన సమయాన్ని ఆసరాగా చేసుకుని.. కూతురిపై పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చగా.. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆ తండ్రి, అతని మొదటి భార్య కలిసి అబార్షన్ చేయించారు. శారీరక, మానసిక వేదనను అనుభవిస్తున్న ఆ బాలిక ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోయింది.

ఇటీవల సదరు బాలికకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పక్కింటి మహిళతో తన బాధను పంచుకోగా.. ఆ మహిళ జరిగిన ఘోరాన్ని గుర్తించి బాలిక కన్నతల్లికి సమాచారం అందించింది. కన్నబిడ్డకు జరిగిన అన్యాయాన్ని విన్న ఆ తల్లి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన గద్వాల పోలీసులు నిందితుడితో పాటు అతడికి సహకరించిన మొదటి భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిపై పోక్సో చట్టం కింద కఠినమైన కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

కన్నబిడ్డ జీవితాన్ని నాశనం చేసిన ఆ నిందితుడికి, అతడికి సహకరించిన మహిళకు చట్టం ద్వారా అత్యంత కఠినమైన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >