| Daily భారత్
Logo




పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ జోరుగా హుషారుగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన కాకతీయ విద్యా సంస్థల విద్యార్థులు

News

Posted on 2025-12-31 20:33:56

Share: Share


పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ జోరుగా హుషారుగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన కాకతీయ విద్యా సంస్థల విద్యార్థులు

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విద్యార్థుల నృత్యాలు..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రాబోయే కొత్త సంవత్సరానికి స్వాగతం తెలిపేందుకు కాకతీయ విద్యాసంస్థల విద్యార్థులు బుధవారం సాయంత్రం జోరుగా హుషారుగా ఆట పాటలతో అదరగొట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ లో గల కాకతీయ విద్యా సంస్థలో 2025 సంవత్సరం ముగింపు సందర్భంగా వీడ్కోలు పలుకుతూ ఉత్సాహంగా 2026 సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల యాజమాన్యం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినిలు తమ నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ 2025 బై బై అంటూ 2026 సంవత్సరానికి వెల్కమ్ అని పేర్కొన్నారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి సంతోషంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో  గడపాలని వారు అన్నారు. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలని వారు అన్నారు. ఎందుకంటే విద్యార్థులే దేశానికి పునాది లాంటివారని 31 డిసెంబర్ అని ఈవెంట్ ల పేరిట ఎవరి పరిధిలో వారు ఉండాలని, ఈవెంట్లు చేసుకోవడం తప్పుకాదు కానీ వాటి పేరు పేరిట తప్పులో నడవద్దన్నారు. ముఖ్యంగా అతిగా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని వాహనదారులను వారు కోరారు.


Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >