Posted on 2025-12-31 18:44:25
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని స్థానిక మారుతి నగర్ లో బుధవారం స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ వారి దివ్యాంగుల పాఠశాలలో కీర్తిశేషులు మాధవి రెడ్డి జయంతి వేడుకలను ఆమె తల్లిదండ్రులు బివి రమణారెడ్డి, లక్ష్మీదేవి లు దివ్యాంగుల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తండ్రి రమణారెడ్డి మాట్లాడుతూ తమ కుమార్తె మాధవిరెడ్డి మరణించి 11 సంవత్సరాలు అవుతుందని, ఆమెకు చిన్నపిల్లలు అంటే అమృతమైన ఇష్టమని ఆమె లేని లోటును దివ్యాంగ బాలల్లో చూసుకుంటున్నామని అందుకే ఆమె పుట్టినరోజును ప్రతి సంవత్సరం దివ్యాంగుల మధ్య జరుపుకుంటున్నామని ఆమె పేరిట మాధవిరెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసి దివ్యాంగులకు మరియు పేద ప్రజలకు సహాయం అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని దివ్యాంగ విద్యార్థుల సహాయార్థం 25వేల రూపాయల చెక్కును అందిస్తున్నామని అదేవిధంగా మానసిక దివ్యాంగులకు యోగ నేర్పించి వారిని ప్రయోజకులుగా మారుస్తున్న యోగ ఉపాధ్యాయురాలు వీణ కు వేల 2500 రూపాయలు చెక్కును అందించారు. అనంతరం దివ్యాంగులకు మిఠాయిలు, బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముబారక్ నగర్ కాలనీవాసులు శ్రీనివాస్ కవితలు పాల్గొన్నారు.
దివ్యాంగ విద్యార్థుల సహాయార్థం కోసం 25 వేల రూపాయల చెక్కు అందజేత
ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, పాఠశాలల సిబ్బంది, మానసిక దివ్యాంగులు, అంధ పాల్గొన్నారు.
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >