| Daily భారత్
Logo




రాజేష్‌ మృతిపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

News

Posted on 2026-01-01 12:58:27

Share: Share


రాజేష్‌ మృతిపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ

డైలీ భారత్, సూర్యాపేట:కోదాడ పట్టణానికి చెందిన దళితుడు కర్ల రాజేష్‌ మృతిపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌కు రాజేష్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఆయన వినతిపత్రం అందించారు. అనంతరం మంద కృష్ణ విలేకరులతో మాట్లాడుతూ కర్ల రాజేష్‌ మృతికి కారణమైన చిలుకూరు ఎస్‌ఐని డిస్మిస్‌ చేయాలని సీఐ, డీఎస్పీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజేష్‌ రిమాండ్‌ రిపోర్ట్ తప్పుల తడకగా ఉందని నిపుణులతో రాజేష్‌ మృతదేహానికి రీ పోస్టు మార్టం చేయాలని కోరారు. జైభీమ్‌ సినిమా మాదిరిగా పోలీసుల కుట్రలు ఉన్నాయని, రాజేష్‌ను చిత్రహింసలు పెట్టి ఎలాగైనా చనిపోయేలా ఉన్నాడన్న తొందరలో కోర్టులో ప్రవేశపెట్టారని తెలిపారు. చిలుకూరు ఎస్‌ఐని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ కేసును కనుమరుగయ్యేలా చేయాలని చూస్తున్నారని, మరింత ప్రజా ఉద్యమంలా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని తెలిపారు. జనవరి 10వ తేదీన కోదాడలో కర్ల రాజేష్‌ సంతాపసభ నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు, సామాజిక న్యాయం కోరే ప్రజాసంఘాలతో తమ పోరాటం ఉధృతం చేస్తామని తెలిపారు. తమ విన్నపంపై కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారని చెపన్పారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి బచ్చలకూర వెంకటేశ్వర్లు మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న మాదిగ, ఎమ్మార్పీఎస్‌ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చింత వినయ్‌ బాబు మాదిగ, సమన్వయకర్త చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ, ఎమ్మెస్పీ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ పాల్గొన్నారు.

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >