| Daily భారత్
Logo




దారుణం... ముగ్గురు పిల్లలకు విషమిచ్చి... తండ్రి ఆత్మహత్య

News

Posted on 2026-01-01 14:12:48

Share: Share


దారుణం... ముగ్గురు పిల్లలకు విషమిచ్చి...  తండ్రి ఆత్మహత్య

డైలీ భారత్, నంద్యాల: ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో తండ్రే తన ముగ్గురు చిన్నారులను విషమిచ్చి.. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలంగా మారింది. ఈ అనూహ్య ఘటనతో కుటుంబం పూర్తిగా ఛిద్రమవ్వడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మొత్తంగా క్షణికావేశంలో, మానసిక ఒత్తిడితో మనుషులు మృగం లాగా మారిపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు అనడానికి ఇదో ఉదాహరణగా నిలుస్తుంది.

జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం తొడుములదీన్నేలో కంటికి రెప్పలా బిడ్డలను కాపాడాల్సిన తండ్రి కాలయముడు లాగా మారాడు. వేములపాటి సురేంద్ర (34) మానసిక ఒత్తిడితో దారుణానికి ఒడిగట్టాడు. మద్యం మత్తులో ఉన్న సమయంలో తన పిల్లలపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం తానే ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం పరిస్థితిని మరింత విషమంగా మార్చింది.

ఈ దారుణ ఘటనలో తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులను సిగిన్నారుకు కావ్య (7 సంవత్సరాలు), ధ్యానేశ్వరి (4 సంవత్సరాలు), సూర్య గగన్ (2 సంవత్సరాలు).. అత్యంత చిన్న వయసులోనే ముగ్గురు పిల్లలు మరణించడంతో గ్రామమంతా శోకసంద్రంగా మారింది. పిల్లల భవిష్యత్తు, కలలు ఇలా ఒక్కసారిగా చిద్రమవ్వడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. కాగా పిల్లల తల్లి సుమారు 8 నెలల క్రితమే అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకొని మరణించారు.

అప్పటి నుంచి సురేంద్ర ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో మానసికంగా కుంగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. సరైన మానసిక సహాయం లేకపోవడం ఈ విషాదానికి దారి తీసి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయ్యాక వెల్లడిస్తామని తెలిపారు.

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >