| Daily భారత్
Logo




టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : పోలీస్ కమిషనర్ సునీల్ దత్

News

Posted on 2026-01-02 11:42:21

Share: Share


టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : పోలీస్ కమిషనర్ సునీల్ దత్

డైలీ భారత్, ఖమ్మం:జనవరి 3 నుండి జనవరి 20   వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని పరీక్ష కేంద్రాలలో నిర్వహించే టీజీ టెట్ పరీక్షల సందర్భంగా అయా పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 7:30 గంటల నుండి సాయంత్రం 6:00 వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అదేవిధంగా ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, దర్నలు, ప్రచారాలు నిర్వహించరాదని పెర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు ముసివేయాలని సూచించారు. పరిక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్  తెలిపారు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు  పోలీసులకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు తో పాటు ట్రాఫిక్ ఆంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పకడ్బంది చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు నిఘాను నియమించి సమాచారం సేకరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలున తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >