Posted on 2026-01-01 23:09:04
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సంక్రాంతి పండుగ వేళ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా హైదరాబాద్ – విజయవాడ హైవే పై టోల్ ప్లాజాల వద్ద ఫ్రీ వే ఏర్పాటుకు కేంద్రానికి రిక్వెస్ట్ చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. పండుగ ముందు 9వ తేదీ నుంచి పండుగ పూర్తయిన తర్వాత 18వ తేదీ వరకూ టోల్ చార్జీలు లేకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి ఈ మేరకు లేఖ రాశారు. ఆ తేదీల్లో టోల్ చార్జీల భారాన్ని రాష్ట్ర ఆర్ఆండ్ బీ శాఖ కేంద్రానికి చెల్లిస్తుందని చెబుతూ ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. సంక్రాంతి పండుగ సమయంలో నేషనల్ హైవేలపై ట్రాఫిక్ రద్దీ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.హైదరాబాద్ – విజయవాడ హైవే పై జనవరి 8 నుండి వాహన రద్దీ ఎక్కువ ఉంటుందని, సంక్రాంతికి వెళ్ళే వారికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు అని కోమటిరెడ్డి అధికారులకు వివరించారు. పోయినసారి ఎదురైనా అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజుకు సుమారు లక్ష వాహనాల ప్రయాణం సాగుతుందని.. దీనిపై అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రేపు తాను తూప్రాన్ పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేస్తానని చెప్పారు. ప్రధానంగా ఎల్బీనగర్ నుండి వనస్థలిపురం, పనామా గోడౌన్, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతాల్లో వేల వాహనాల రాకపోకలతో రద్దీ ఏర్పడుతుందని, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఆగడానికి వీల్లేదు అని అధికారులకు స్పష్టం చేశారు.పండుగ రద్ధీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు
పండుగ సందర్భంగా జాతీయ రహదారులపై ట్రాఫిక్ రద్దీ సమస్యల నివారణకు ఆ రోజుల్లో హెవీ వెహికల్స్‌కు అనుమతి నిరాకరించాలని నిర్ణయించామని మంత్రి వెంకట్ రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్‌ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకుని.. గుంతలను ఈ రోజు రాత్రి నుంచే పూడ్చే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి 20కిలోమీటర్లకు అంబులెన్స్‌లను సిద్దంగా ఉంచుతామనితెలిపారు. రోడ్దు భద్రత, ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం పండుగ సందర్భంగా 2వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారని చెప్పారు. ఇందుకోసం డీజీపీ శివధర్ రెడ్డితో మాట్లాడినట్టు తెలిపారు. విజయవాడ –హైదరాబాద్ జాతీయ రహదారి మార్గంలోని చిట్యాల , చౌటుప్పల్ సహా ఎక్కడా కూడా రోడ్ల వెంట వాహనాలు నిలుపరాదని.. నిలిపిన వాహనాలను సీజ్ చేస్తారని తెలిపారు. అలాగే ఎక్కడైనా వాహనాల సమస్యలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడితే వాటిని తొలగించేందుకు భారీ క్రేన్లు అందుబాటులో పెడుతున్నామని పేర్కొన్నారు. సంక్రాంతి సందర్బంగా రహదారి విధుల్లో ఉండే ఆర్ ఆండ్ బీ, రోడ్డు ట్రాన్స్ పోర్టు శాఖల ఉన్నతాధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లుగా వెల్లడించారు.
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >