| Daily భారత్
Logo




ఏటీఎం దొంగలు దొరికేనా..?

News

Posted on 2026-01-02 17:42:22

Share: Share


ఏటీఎం దొంగలు దొరికేనా..?

హర్యానా రాష్ట్రంలో జిల్లా దర్యాప్తు బృందాలకు తప్పని కష్టాలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన ఏటీఎం  దొంగలు ఇప్పట్లో దొరికేనా..? అనే అనుమానం తలెత్తుతుంది. ఈ రెండు ఏటీఎంలలో చోరీ కీ పాల్పడింది  హర్యానాలోని మేవత్ గ్యాంగ్ ముఠాగా గుర్తించి వారిని పట్టుకునేందుకు పోలీసులకు తిప్పలు తప్పడం లేదు. హర్యానా పోలీసులు నిజామాబాద్ పోలీసులకు  దొంగల ముఠాను పట్టుకునేందుకు ఏలాంటి సహకారం అందించడం లేదని తెలుస్తోంది. మొత్తం ఐదు బృందాల ద్వారా ఏటీఎం దొంగల కోసం అన్వేషణ చేపట్టారు. చోరీ జరిగిన వెంటనే హర్యానా ముఠాగా గుర్తించి  వారు రాష్ట్రం దాటకుండా పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో దొంగలను పట్టుకునేందుకు ఏర్పడిన ప్రత్యేక బృందాలు గత నాలుగు రోజులుగా ఢిల్లీ హర్యానాలలో  మకాం వేసి గాలింపు చర్యలను ముమ్మరం  చేశారు. అయితే కరడు కట్టిన ఈ దొంగల ముఠా  పోలీసులకు పట్టుబడకుండా  స్థానికులతో పాటు అక్కడి పోలీసుల సైతం సహకరించకపోవడంతో దొంగల ముఠా చిక్కడం కష్టమేనన్న ప్రచారం జరుగుతుంది. గత వారం రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్య నగర్ ప్రాంతంలో గల  డి సి బి ఏటీఎంలో 27 లక్షలు, ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  సాయి నగర్ లో గల ఎస్బిఐ బ్యాంక్ ఏటీఎంలో నాలుగు లక్షల వరకు  చోరీ చేసిన విషయం తెలిసిందే. ఈ చోరీ ని సవాల్ గా తీసుకున్న  పోలీస్ శాఖ దొంగల కోసం  వేట ప్రారంభించారు. అయితే ఈ రెండు చోరీలకు పాల్పడిన ముఠాను గుర్తించిన పోలీసులు, ఈ దొంగల ముఠా ను పట్టుకునేందుకు మాత్రం  ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దొంగల ముఠాను పట్టుకునేందుకు ఏర్పడిన ఐదు బృందాలు అక్కడ ఎదురవుతున్న పరిస్థితులను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. దీంతో జిల్లా ఉన్నతాధికారులు  హర్యానా పోలీస్ పెద్దలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. దొంగల అమ్ముతాను పట్టుకునేందుకు సహకారం అందించాలని కోరినట్లు తెలిసింది. అయితే జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. హర్యానాకు వెళ్లిన ప్రత్యేక బృందాలు దొంగలను పట్టుకొని వస్తారా లేదా వట్టి చేతులతో వస్తారన్నది ప్రస్తుతం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్  సాయి చైతన్య మాత్రం తొందర్లోనే దొంగలను పట్టుకుంటామని హామీ ఇవ్వడం అక్కడి పోలీసు ఉన్నతాధికారులు సహకరిస్తున్నారన్న నమ్మకం ఏర్పడింది. దీంతో ప్రత్యేక బృందాలు దొంగలతోనే తిరిగి వస్తారన్న భరోసా ఏర్పడింది.

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >