Posted on 2026-01-02 23:21:36
డ్రైవింగ్ లో సీట్ బెల్ట్ తప్పని సరిగా పెట్టుకోవాలని సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ సూచించారు.
డైలీ భారత్ వేములవాడ: రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ సిబ్బంది శుక్రవారం వేములవాడ కమాన్ వద్ద కార్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని కార్ల వాహనదారులు సీటు బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం తాగి నడపవద్దని, రాంగ్ రూట్ లో వెళ్లకూడదని, మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని సూచించారు. స్పీడ్ కంట్రోల్ లో ఉండాలని, వాహనం రివర్స్ లో వెళ్లేప్పుడు తప్పనిసరిగా వాహనం కింద, వెనుక గమనించాలని పేర్కొన్నారు. సీటు బెల్టు పెట్టుకుని వాహనాన్ని నడిపిన వారికి స్వీట్లు పంపిణీ చేశారు. సీటు బెల్ట్ ధరించకుండా వాహనాలను నడిపిన వారికి దాని ప్రాముఖ్యత గురించి తెలిపారు. వాహనాలకు వాహన భద్రతా స్టిక్కర్లు అతికించారు. సీట్ బెల్ట్ పెట్టుకొని వాహనం నడుపుతామని వాహన దారులతో రోడ్డు భద్రతా మాసోత్సవాల ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో వేములవాడ ట్రాఫిక్ ఎస్ఐ రాజు, మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్, మోటార్ వాహనాల సహాయక తనిఖీ అధికారి రజిని, పృథ్వీరాజ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
#rajannasircilla
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >