| Daily భారత్
Logo




హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలి : చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

News

Posted on 2026-01-03 17:52:41

Share: Share


హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలి : చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం హోం గార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన సాగిన శాసన పరిషత్తు  25 వ సమావేశాల మూడవ రోజు ప్రశ్నోత్తరాల సమయం తరువాత సాగిన ప్రత్యేక ప్రస్తావన లో ఆయన హోం గార్డుల సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 14,000 మంది హోంగార్డులు పోలీస్ శాఖలో పనిచేస్తున్నారని చెప్పారు. పోలీస్ శాఖ లోని ఉన్నతాధికారులు మొదలు  కానిస్టేబుల్ వరకు ఉద్యోగుల తో కలిసి వారు అనునిత్యం శాంతి భద్రతల కోసం తపిస్తూ విధులను నిర్వహిస్తుంటారని చెప్పారు. అసలు పోలిసు శాఖ లో  ముందుండి పని చేసేది హోంగార్డు లేదని ఆయన అన్నారు. ఇలా కష్టపడే హోంగార్డులు వేతనాలు, ఇతర ప్రభుత్వ ద్వారా అందే సదుపాయాల పొందడం కోసం  కష్టాల పాలవుతున్నారని ఆయన చెప్పారు. చివరకు వారి కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ పరిస్థితిలో సైతం వారు కష్టపడుతుంటే పట్టించుకునే వారు కరువై నట్లు వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని  చెప్పారు. ఈ నేపథ్యంలో వారికి ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని  చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ద్వారా కోరుతున్నట్లు ఆయన వివరించారు. ఇందుకు స్పందించిన రాష్ట్ర మంత్రి హజరుద్దీన్ హోం గార్డుల  సమస్యలను పరిష్కరిస్తామని అందుకు సీఎంకు నివేదిస్తానని హామీ ఇచ్చారు.

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >