| Daily భారత్
Logo




తెలంగాణ లో జాలాశయాలకు ఆనకట్టలు కట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కే సీ ఆర్ కే దక్కుతుంది

News

Posted on 2026-01-03 19:41:01

Share: Share


తెలంగాణ లో జాలాశయాలకు ఆనకట్టలు కట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కే సీ ఆర్ కే దక్కుతుంది

భారాస లీగల్ సెల్ కన్వీనర్ మధుసుదన్ రావు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ నది ప్రవాహలకు ఆనకట్టలు కట్టిందే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని నిజామాబాద్ భారాస లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసుదన్ రావు తెలిపారు. తెలంగాణ పల్లెల్లో పచ్చని పంటలు కలకలలాడుతున్నాయంటే కారణం భారాస అధినేత కేసీఆర్ కు జలవనరులపై ఉన్న అధ్యయమేనన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్న మాటలు నీటిమీద మూటలేనని ఆయన ఎత్తిపొడిచారు. తెలంగాణ నీటి వనరులపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి నీటి ప్రాజెక్టులపై మాట్లాడం అవగాహన రాహిత్యమేనని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో, ఉద్యమానికి ముందు ముందుచూపుతోనే నీటిని ఒడిసి పట్టడానికి ప్రణాళికలు వేసింది, నీటిని ఒడిసి పట్టి పంట పొలాలకు పారిచ్చింది కేసీఆర్ అని మధుసుదన్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర నదిజలాలపై ఏమాత్రం సోయి లేనోళ్ళు పాలకులుగా ఉండటమే తెలంగాణ కు శాపంగా మారిందని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధకుడైన కేసీఆర్ ను ఉగ్రముష్కరుడు కసబ్ తో పోల్చడం, ఉరితీయమనడం ముఖ్యమంత్రి స్థాయికి తగదని ఆయన అన్నారు.

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >