Posted on 2026-01-04 18:28:35
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం 2026 సంక్రాంతి పండుగను ప్రజలు శాంతియుతంగా, సురక్షితంగా మరియు ఆనందంగా జరుపుకోవాలని జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ లక్ష్మి మరియు అన్నపురెడ్డిపల్లి మండల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సింహ రెడ్డి గ్రామప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సమయంలో అన్నపురెడ్డిపల్లి మండలం పరిధిలో కోడి పందేలు, పేకాట (పోకర్/కార్డుల జూదం), అక్రమ మద్యం విక్రయాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిని పూర్తిగా నియంత్రించేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.కోడి పందేలు మరియు పేకాట చట్టరీత్యా నేరమని, వీటిలో పాల్గొన్న వారితో పాటు, ఈ కార్యక్రమాలకు స్థలాలు కల్పించిన వారు, నిర్వహించిన వారు, ప్రోత్సహించిన వారిపై కూడా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైన చోట్ల విస్తృత తనిఖీలు మరియు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.జూదం వంటి అక్రమ కార్యకలాపాలు యువతను తప్పుదారి పట్టించి కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తాయని, ఆర్థిక నష్టాలు మరియు సామాజిక సమస్యలకు దారితీస్తాయని జూలూరుపాడు సిఐ శ్రీ లక్ష్మి తెలిపారు. సంక్రాంతి పండుగ సంప్రదాయాలనుకాపాడుకుంటూ, చట్టాన్ని గౌరవిస్తూ పండుగను జరుపుకోవాలని ప్రజలను కోరారు.ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కోడి పందేలు లేదా జూదం జరుగుతున్నట్లుగ మనించినట్లయితే వెంటనే అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100 / 112 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసాఇచ్చారు. ఈ కార్యక్రమంలోఅన్నపురెడ్డిపల్లి ఎస్ఐ విజయ్ సింహరెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >