Posted on 2026-01-04 20:05:21
ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిషన్ గంజ్ లో ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత ఆరోగ్య శిబిరానికి ముఖ్య అతిధిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. అంతకుముందు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ ఉచిత హెల్త్ క్యాంప్ కి సన్రైజ్ హాస్పిటల్, మనోరమ హాస్పిటల్ కు చెందిన వైద్యులు పాల్గొని వివిధ ఆరోగ్యపరమైన పరీక్షలు నిర్వహించారు. రక్త పరీక్షలు, బిపి చెకప్, ఆర్థోపెడిక్, దంత సమస్యలు, గుండెకు సంబంధించిన వైద్య నిపుణులు, నరాలకు సంబంధించిన వైద్యులు, కంటి చూపుకు సంబంధించిన వైద్యులు తో సహా తొమ్మిది మంది డాక్టర్లచే హెల్త్ క్యాంప్ నిర్వహించారు అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్ని రకాల ఒత్తిడిలు ఉన్న ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యమే ప్రధానమని ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించవచ్చు అని ఆయన అన్నారు. అలాగే ఆర్యవైశ్యులే కాకుండా సాధారణ ప్రతి పౌరులు ఆరోగ్యపరంగా బాగుండాలని అందుకే ఆర్యవైశ్య సంఘం వారు ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయ విషయం అన్నారు. ఆర్యవైశ్యుల్లో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత తనదని ఆయన స్పష్టం చేశారు. ఆర్య వైశ్యులు కూడా పేద వారు చాలామంది ఉన్నారని అర్హులైన వారందరికీ తన నియోజకవర్గ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలో ఉన్న వైశ్య సోదరులందరలే కాకుండా ఇతర కులాలకు చెందిన పేద ప్రజలు ఈ హెల్త్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవడం తనకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే ను ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. అలాగే ఈ మెగా హెల్త్ క్యాంప్ లో పాల్గొన్న వైద్యులను ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు.
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ముక్కా దేవేందర్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు దన్పాల్ శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్ గుప్తా, గాలి నాగరాజు గుప్తా, లాబిశెట్టి శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >