Posted on 2026-01-04 20:19:40
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబూర్గంపాడు మండలం దురదృష్టవశాత్తు ఐటిసి పిఎస్పీడీ పేపర్ పరిశ్రమలో వన్ ఎ రివైండింగ్లో చేయిపడి గాయపడి చికిత్స పొందుతున్న కాంట్రాక్ట్ కార్మికుని కుటుంబాన్ని ఐటిసి యజమానం ఆదుకోవాలని సారపాక మేజర్ గ్రామపంచాయతీ 14వ వార్డు మెంబర్ కొమరం సావిత్రి కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు సేఫ్టీ అత్యంత ముఖ్యమైనదిగా చూడాలని దానికోసం ఉన్నత అధికారుల పర్యవేక్షణ నిరంతరాయంగా చేయడం ద్వారా ఇటువంటి ప్రమాదాలు జరగవు అని అన్నారు. రోజురోజుకి టెక్నాలజీ పెరుగుతూ అభివృద్ధి చెందుతున్న తరుణంలో కూడా కార్మికులకు సేఫ్టీ పరికరాలు అందుబాటులోకి తీసుకురాక పోవడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పర్మినెంట్ ఉద్యోగులతో చేయించాల్సిన పని నీ కాంట్రాక్ట్ కార్మికుల చేత వెట్టి చాకిరి చేపిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ దోపిడీ చేయడమే కాకుండా వారి ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా పని భారాన్ని పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైన రాబోయే కాలంలో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కాంట్రాక్టు కార్మికుల ప్రాణాలను కాపాడటం కోసం అధునాతన సేఫ్టీ పరికరాలు ఉపయోగించాలని మరియు రెగ్యులర్ ఉద్యోగంతో పాటు సమాన పనికి సమాన వేతనాలు అందించడానికి యజమాన్యం కృషి చేయాలని కోరారు. గాయపడ్డ కాంట్రాక్ట్ కార్మికుడికి అండగా ఐటీసీ యాజమాన్యం ఉండాలని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బత్తుల కిషోర్ తొందరగా కోలుకోవాలని ఆ దేవుడిని వేడుకున్నారు
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >