Posted on 2026-01-07 15:56:28
సైబర్ నేరాల పట్ల విద్యార్థి దశ నుండే చైతన్యం అవసరం
ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కష్టపడి చదివితేనే విజయాలు సాధ్యమవుతాయి.
డైలీ భారత్, ముస్తాబాద్: ముస్తాబద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ వారి సౌజన్యంతో ముస్తాబద్ మండల పరిధిలోని జడ్పీ ఎచ్ఎస్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వైద్య శిబిరానికి విద్యార్థుల నుండి విశేష స్పందన లభించగా, పెద్ద సంఖ్యలో విద్యార్థులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆరోగ్య సమస్యలపై వైద్య నిపుణులు విద్యార్థులకు పలు సూచనలు చేయడం జరిగింది.
అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...
విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో మంచి ఫలితాలు సాధించగలరని తెలిపారు.చిన్న వయస్సులోనే ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని క్రమశిక్షణతో కష్టపడి చదివితేనే జీవితంలో విజయాలు సాధ్యమవుతాయని,చదువుతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ అలవర్చుకోవాలని హితవు పలికారు.
ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, సోషల్ మీడియా మోసాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లు ప్రస్తుత సమాజంలో ఏఐ ఆధారిత వీడియో మెసేజ్ ల ద్వారా మోసం చేస్తున్నరని, వాటిపట్ల అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులు సామజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత విషయాలు సామాజిక మాధ్యమాల్లో పంచుకువద్దని తెలిపారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులలకు, ఉపాధ్యాయులు, పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సైబర్ నేరాలకు మోసపోయిన వెంటనే సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి.కాల్ చేసి ఫిర్యాదులను చేయాలన్నారు. సైబర్ నేరాలలో గోల్డెన్ హవర్ ముఖ్యమైనదని మోసపోయిన వెంటనే గ్రహించి ఫిర్యాదు చేసిన యెడల, మోసపోయిన డబ్బు ఎక్కువ శాతం తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ప్రస్తుత కాలంలో విద్యార్థులను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు బ్లెడ్ సమస్య మరియు కంటి సమస్యలు.ఈనేపథ్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో విద్యార్థులకు సాధారణ వైద్య పరీక్షలు,కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వైద్య సూచనలు అందించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ యాజమాన్యంతో పాటు ఇందులో పాల్గొన్న వైద్య నిపుణులు , సిబ్బందికి , సురభి వైద్య విజ్ఞాన సంస్థ సిబ్బంది,జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సి.ఐ మొగిలి,Meo రాజిరెడ్డి,ఎస్.ఐ గణేష్, డాక్టర్లు చంద్రశేఖర్ రావు, శ్రీకాంత్ , అనురాధ, స్రవంతి, సురభి వైద్య విజ్ఞాన సంస్థ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >