Posted on 2026-01-07 18:00:29
డైలీ భారత్, సిరిసిల్ల:స్వచ్ఛ సర్వేక్షన్ 2025 లో భాగంగా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టే దిశగా వివిధ వాణిజ్య వ్యాపార ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించబడినవి. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వినియోగిస్తున్న మరియు విక్రయిస్తున్న వ్యాపారులపై జరిమానాలు విధించబడినవి.
ఈ సందర్భంగా వ్యాపార వర్గాలు, దుకాణదారులకు ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి కలిగే నష్టాలపై అవగాహన కల్పించడంతో పాటు, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ నిబంధనలను వివరించారు. పునరావృతంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సిరిసిల్లను శుభ్రంగా నిలుపుకోవడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నివారించి, గుడ్డ సంచులు, కాగితపు కవర్లు వంటి పర్యావరణహిత పదార్థాలను వినియోగించాలని మున్సిపాలిటీ అధికారులు వ్యాపారులకు మరియు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
#sircilla #rajanna sircilla
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >