| Daily భారత్
Logo




వేములవాడ : హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

News

Posted on 2026-03-08 19:12:13

Share: Share


వేములవాడ : హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

డైలీ భారత్, వేములవాడ: వేములవాడ పట్టణంలో జరిగిన భూక్య మోహన్ హత్య కేసును వేములవాడ టౌన్ పోలీసులు త్వరితగతిన ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

దర్యాప్తులో భాగంగా మృతుడు భూక్య మోహన్ కు బైరి శారద @ కళ్యాణి (నర్స్, అంజనీ నగర్, వేములవాడ) తో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిసింది. మోహన్ తరచూ డబ్బులు అడుగుతూ మరియు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించడంతో, శారద తన భర్త బైరి శేకర్ తో కలిసి మోహన్ ను హత్య చేయాలని పథకం రచించారు. ఈ పథకంలో గుండం రవి @ రవీందర్ కూడా సహకరించాడు.

తేదీ 04-03-2026 న శారద మోహన్ ను వేములవాడలోని సిద్ధార్థ కాంప్లెక్స్ కు పిలిపించగా, అక్కడికి వచ్చిన శేకర్ మరియు రవి కలిసి నైలాన్ తాడుతో ఉరివేసి మోహన్ ను హత్య చేశారు.

తిప్పాపూర్ బస్ స్టాండ్ వద్ద నిందితులు బైరి శారద, బైరి శేకర్ మరియు గుండం రవి లను పోలీసులు అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన బైక్, నైలాన్ తాడు మరియు చాకు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, రిమాండ్ కు తరలించారు.

ఈ కేసును త్వరితగతిన ఛేదించిన వేములవాడ టౌన్ CI వీర ప్రసాద్, SI రామ్మోహన్, SI ప్రేమానందం, PC ఇమ్రాన్, PC సల్మాన్, PC శ్రీనివాస్ లను శ్రీనివాసులు, డిఎస్పీ వేములవాడ అభినందించారు.

Image 1

"డ్రగ్స్ ఫ్రీ సిరిసిల్ల కోసం యువత ముందుకు రావాలి"

Posted On 2026-06-25 12:30:42

Readmore >
Image 1

మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "సే నో టు డ్రగ్స్" అవగాహన సదస్సు

Posted On 2026-06-25 12:21:26

Readmore >
Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >