| Daily భారత్
Logo




జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్‌లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు

News

Posted on 2026-03-14 19:33:15

Share: Share


జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్‌లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు

దొంగిలించిన వెండి నగలు, కాపర్ ఎర్త్ పట్టి, కాపర్ వైర్, రెండు సెల్ ఫోన్లు మరియు రూ. 4,500/- నగదు స్వాధీనం.

వాహన తనిఖీల్లో గ్యాంగ్‌ను పట్టేసుకున్న కామారెడ్డి పోలీసులు – అత్యంత చాకచక్యమైన ఆపరేషన్.

సాంకేతిక పరిజ్ఞానం మరియు CCTV ఆధారాలతో విచారణ – రెండు ప్రత్యేక బృందాల సమర్థ వేట.

ఇన్చార్జి కామారెడ్డి డిఎస్పి యస్. శ్రీనివాస రావు 

డైలీ భారత్, కామారెడ్డి: జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును కామారెడ్డి పోలీసులు రట్టు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, CCTV ఫుటేజీల ఆధారంగా గాలించిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి భారీగా వెండి నగలు, నగదు మరియు కాపర్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు

కామారెడ్డి మండలం వడ్లర్ గ్రామానికి చెందిన వద్దే పద్మ అను మహిళా తేదీ 22.02.2026 న పని నిమిత్తం తన కుమార్తెతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఆమె ఇంటి తలుపులకు తాళం వేసి వెళ్లగా, గుర్తు తెలియని దొంగలు ఇంటి తలుపు తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలో భద్రపరచిన  సుమారు 3 తులాలు బంగారు పుస్తెలు తాడు , 15 తులాలు వెండి నడుము గొలుసు, 15 తులాలు బ్రేస్లెట్లు, 8 తులాలు వెండి ముద్దలు మరియు కొంత నగదును దొంగిలించి వెళ్లారు. అదే సమయంలో సమీపంలోని మరో ఇంటి తలుపు కూడా పగులగొట్టి అక్కడ ఉంచిన సుమారు 10 తులాలు వెండి ముద్దలను కూడా దొంగిలించినట్లు తెలిసింది. ఈ ఘటనపై దేవన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో తేదీ:28.02.2026 న బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర IPS ఆదేశాల మేరకు, డిఎస్పి శ్రీనివాస రావు పర్యవేక్షణలో సిఐలు రామన్, సంతోష్ మరియు ఎస్.ఐల బృందం రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. ఈ రోజు  టెక్రియల్ ఎక్స్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన సిద్దిపేట జిల్లాకు చెందిన నూనె నర్సింలు మరియు మరో మైనర్ (JCL)ను అదుపులోకి తీసుకున్నారు.   విచారణలో భాగంగా వారు గత రెండు నెలలుగా దేవునపల్లి, తాడ్వాయి మరియు ఎస్‌.ఎస్‌.నగర్ మండలాల్లో మూడు ఇండ్లలో దొంగతనాలు చేయడంతో పాటు మూడు ట్రాన్స్ఫార్మర్ల కాపర్ కాయిల్స్ మరియు ఎర్త్ వైర్లు దొంగిలించినట్లు ఒప్పుకున్నారు

అరెస్టయిన ఈ అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు నలుగురు కలిసి ఒక ప్రత్యేక గ్యాంగ్‌గా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నారు. వీరి ప్రధాన లక్ష్యం పగలు మరియు రాత్రి సమయాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించడం. అత్యంత చాకచక్యంగా ఇనుప రాడ్లను ఉపయోగించి ఇంటి ప్రధాన తలుపులు, బెడ్‌రూమ్ మరియు బీరువా లాకులను క్షణాల్లో పగులగొట్టి లోపలికి ప్రవేశిస్తారు. నిమిషాల వ్యవధిలోనే బంగారం, వెండి ఆభరణాలు మరియు నగదును దోచుకుని పరారవుతారు. కేవలం ఇళ్లలోనే కాకుండా, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను టార్గెట్ చేసి, వాటిలోని విలువైన కాపర్ కాయిల్స్ మరియు ఎర్త్ పట్టీలను కూడా దొంగిలిస్తున్నట్లు విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు

అరెస్టు చేసిన నిందితులు వివరములు 

1) నూనె నర్సింలు, తండ్రి బిక్షపతి, వయస్సు: 43 సం,  డుబ్బాక గ్రామం & మండలం, సిద్ధిపేట జిల్లా

2) JCL. 

త్వరలోనే మిగతా ఇద్దరిని కూడా పట్టుకొని అరెస్ట్ చేస్తామని తెలిపారు.

నిండుతుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్న వివరములు.  

1.వెండి కాళ్ల పట్టీలు (సిల్వర్ అంక్లెట్) 20 తులాలు        2.వెండి ముద్ద 5 తులాలు

3.వెండి కాళ్ల పట్టీలు (సిల్వర్ అంక్లెట్) 15 తులాలు        4. రెడ్మీ మొబైల్ ఫోన్

5.ఐక్యూ (iQOO) మొబైల్ ఫోన్                                  6.నగదు రూ.4,500/

7.రాగి వైరు సుమారు 15 కిలోలు                                8.రాగి ఎర్త్ వైరు సుమారు 10 కిలోలు

9.ఒక TVS XL బైక్                                                  10. 2 మొబైల్ ఫోన్లు (నిందితులవి)

నూనె నర్సింలు పైన గతం లో సైబరాబాద్ లోని శామీర్పేట, సిద్దిపేట జిల్లా లోని రైపోల్, తొగుట, కుకూనూర్ పల్లి పోలీసు స్టేషన్ లలో దొంగతనం కేసులు గలవు. 

JCL పైన మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లాలు, రామగుండం, సైబరాబాద్ కమిషనరేట్ లలో 9 దొంగతనం కేసులు గలవు.

అత్యంత చాకచక్యంగా మరియు సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఈ అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన కామారెడ్డి రూరల్ సిఐ రామన్, సదాశివనగర్ సిఐ సంతోష్, దేవునపల్లి ఎస్.ఐలు రంజిత్, భువనేశ్వర్, సదాశివనగర్ ఎస్.ఐ పుష్ప రాజ్, సి.సి.ఎస్ ఎస్.ఐ ఉస్మాన్ మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర IPS ప్రత్యేకంగా అభినందించారని ఇన్చార్జి డిఎస్పి శ్రీనివాస రావు ఈ సందర్భంగా తెలిపారు.

Image 1

సామాజిక న్యాయం చెప్పటం కాదు - అమలు చేయాలి

Posted On 2026-04-11 17:27:29

Readmore >
Image 1

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి

Posted On 2026-04-11 17:12:24

Readmore >
Image 1

ప్రజానాట్య మండల రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

Posted On 2026-04-11 16:26:39

Readmore >
Image 1

కేరళ తరహాలో మున్సిపాలిటీల్లో ఉపాధి పనిని ప్రవేశపెట్టాలి

Posted On 2026-04-11 16:25:00

Readmore >
Image 1

గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-11 16:20:14

Readmore >
Image 1

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు

Posted On 2026-04-11 16:16:39

Readmore >
Image 1

అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్

Posted On 2026-04-11 16:14:19

Readmore >
Image 1

మహాత్మా జ్యోతిబా పూలె జయంతి ఉత్సవాలలో -టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ

Posted On 2026-04-11 16:12:01

Readmore >
Image 1

సింగర్ మంగ్లీపై కేసు నమోదు

Posted On 2026-04-11 11:02:54

Readmore >
Image 1

కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు

Posted On 2026-04-11 10:47:57

Readmore >