Posted on 2026-03-14 19:39:44
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పునః నిర్మించిన తెలంగాణ శాసన మండలి లో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. శనివారం మహేందర్ రెడ్డి, సతీమణి పట్నం సునీత రెడ్డి, కుమార్ రినీష్ రెడ్డి తో కలిసి మండలి కార్యదర్శి నర్సింహా చార్యులు వేద పండితులు పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆయన తన ప్రధాన ఛాంబర్ లో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా సెక్రటరీ నర్సింహా చార్యులు చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కి బోకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కార్యాలయ సిబ్బంది పేషీలో పూజలు చేశారు. అధికారులు ఉపేందర్ రెడ్డి, సుధాకర్, చీఫ్ మార్షల్ సంజీవరెడ్డి,పీఎస్ ప్రకాష్,అడీషనల్ పీఎస్ నాగిరెడ్డి, పీఆర్ఓ మల్లారెడ్డి, పీఏలు బాలు, రాజు, రాజేందర్ రెడ్డి, వంశి తదితరులు పాల్గొన్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >