| Daily భారత్
Logo




నేషనల్‌ హైవే 65పై కొత్త ఫ్లీ ఓవర్‌.....ఆప్రాంతంలోనే,ప్రమాదాలకు చెక్‌

News

Posted on 2024-09-01 14:06:02

Share: Share


నేషనల్‌ హైవే 65పై కొత్త ఫ్లీ ఓవర్‌.....ఆప్రాంతంలోనే,ప్రమాదాలకు చెక్‌

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక కొత్త ఫ్లైఓవర్లు అండర్‌పాసులు అందుబాటులోకి వచ్చాయి. పెరుగుతున్న ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాలను నివారించటానికి ఈ ఫ్లైఓవర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా.. హైదరాబాద్ శివారులో మరో ప్లైఓవర్ అందుబాటులోకి రానుంది. తెలంగాణ-కర్ణాటక మధ్య రాకపోకలకు వీలుగా సంగారెడ్డి శివారు లింగంపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద ఈ ప్లైఓవర్ నిర్మించనున్నారు. ఇక్కడ తరచూ జరుగుతున్న ప్రమాదాలకు చెక్‌ పెట్టాలని జాతీయ రహదారుల సంస్థ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ మేరకు ఈ ఆ రహదారిపై వంతెన నిర్మించేందుకు టెండర్లు ఆహ్వానించింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మీదుగా ఈ జాతీయ రహదారి వెళ్తుంది. (NH 65) లింగంపల్లి క్రాస్‌ రోడ్డుకు సమీపంలో పలు గ్రామాలు ఉండడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ రోడ్డును దాటే క్రమంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ క్రాస్‌ రోడ్డు వద్ద ఫ్లోఏవర్ నిర్మించాలన్న ప్రతిపాదన చాలా ఏళ్లుగా ఉంది. తాజాగా రూ.18.50 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది.

ఇ ప్లైఓవర్ నిర్మాణం పూర్తయిన తరవాత వంతెన పైనుంచి వాహనాలు రాకపోకలు సాగించనున్నాయి. వంతెన కింద నుంచి సమీపంలోని గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలుగా అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారు. టెండర్లు దాఖలు చేసేందుకు ఈ ఏడాది అక్టోబరు 15వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గే ఛాన్స్ ఉంది. దాంతో పాటుగా సమీప గ్రామాల ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.

ఇక హైదరాబాద్-నాగార్జున సాగర్ హైవే నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రహదారి విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ హైవే రెండు వరుసలుగా ఉండగా.. దాన్ని 4 వరుసలుగా మార్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాగార్జున సాగర్ సందర్శించే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

త్వరలోనే ఈ పనులు పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈ నాలుగు వరసల రహదారి అందుబాటులోకి వస్తే ఏపీలోని గుంటూరు, ఒంగోలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వెళ్లే వారు త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకునే వీలుంటుంది. విజయవాడ హైవేపై కొంత మేర భారం తగ్గనుంది. అలాగే ఈ ప్రాంతంలో గణనీయమైన అభివృద్ది కూడా చోటు చేసుకుంటుంది.

Image 1

ప్రతిభ రత్న అవార్డుకు డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-04-23 11:00:59

Readmore >
Image 1

అర్ధరాత్రి ఒంటరి యువతికి రక్షణగా నిలిచిన ఆర్టీసీ బస్సు...

Posted On 2026-04-23 10:06:26

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం... 11మంది సజీవ దహనం

Posted On 2026-04-23 10:03:16

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికుల సమ్మె – శాంతియుతంగా నిర్వహించాలి

Posted On 2026-04-22 22:58:48

Readmore >
Image 1

ఫరీద్‌పేట్ గ్రామ పంచాయతీలో అక్రమాల ఆరోపణలు

Posted On 2026-04-22 22:55:13

Readmore >
Image 1

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ

Posted On 2026-04-22 20:13:36

Readmore >
Image 1

మురికికాలువ త్రవ్వేసి మధురానగర్ రోడ్డు కబ్జా?

Posted On 2026-04-22 20:10:32

Readmore >
Image 1

ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

Posted On 2026-04-22 12:20:38

Readmore >
Image 1

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం

Posted On 2026-04-22 10:42:24

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

Posted On 2026-04-22 07:35:51

Readmore >