Posted on 2024-10-01 19:29:19
డైలీ భారత్, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఇవాళ నిరసన సెగ తగిలింది. ముషీరాబాద్ వద్ద ఆయనను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. గోబ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశాయి.
ముసీ నది పరివాహక ప్రాంత నివాసితులకు భరోసా కల్పించేందుకు ఆయన వెళ్తుండగా… ముషీరాబాద్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మూసీ నది రివర్ బెడ్ పరిధిలో ఉన్న నివాసాల కూల్చివేతలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. ఖాళీ చేసిన ఇళ్లను అధికారులు కూల్చి వేస్తున్నారు.
ఈ క్రమంలో ఆ ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. కూల్చివేత లను పరిశీలించేందుకు, బాధితులకు భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ చాదర్ ఘాట్ కు బయల్దేరారు.
విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ముషీరాబాద్ వద్ద కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకు న్నాయి. కొందరు కేటీఆర్ ప్రయాణిస్తున్న వాహనంపైకి కూడా ఎక్కారు. మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు బాధ్యత వహిస్తూ కేటీఆర్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 18:20:34
Readmore >