Posted on 2024-10-01 19:31:10
డైలీ భారత్, హైదరాబాద్: పల్లెటూరు నుంచి పట్టణం వరకు ఇంట్లో అయినా వీధిలో అయినా ఏ చిన్న కార్యక్రమం జరిగినా డీజేలు ఉంటున్నాయి. ముఖ్యంగా గత కొన్నాళ్లుగా డీజేల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఆఖరికి చావులకు కూడా డీజేలు పెట్టేస్తున్నారు. డీజేల కారణంగా సౌండ్ పొల్యూషన్ మాత్రమే కాకుండా ప్రజల ప్రాణాలకు సైతం హాని కలుగుతోంది. డీజే సౌండ్స్ కారణంగా కొందరు హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాలు కోల్పోతుండటం ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ లో డీజేలు,సౌండ్ మిక్సర్‌లు, హైసౌండ్ ఎక్యూప్‌మెంట్, క్రాకర్లపై బ్యాన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఊరేగింపులు,వేడుకల్లో ఇకపై వీటిని వాడరాదు. స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, కోర్టులకు 100 మీటర్ల వరకు నిషేదం అమల్లో ఉంటుందని.. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, ఫైన్ కూడా ఉంటుందని హెచ్చరించారు.
కాగా, 4 జోన్లలో సౌండ్ సిస్టం పెట్టడానికి డెసిబిల్స్ నిర్దేశించారు. జనావాసాల ప్రాంతంలో ఉదయం 55 డెసిబిల్స్‌కు మించి సౌండ్ సిస్టంలో వాడకూడదని చెప్పారు. రాత్రి వేళల్లో 45 డెసిబిల్స్‌కు మించి సౌండ్ సిస్టమ్ లో వాడకూడదన్నారు. డయల్ 100కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇటీవల మత పెద్దలతో,రాజకీయ నేతలతో సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 18:20:34
Readmore >