Posted on 2024-10-01 20:20:49
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణం శరణబసప్ప కాలనీలోని కాకతీయ పాఠశాలలో మంగళవారం పాఠశాల డైరెక్టర్ వంశీ కృష్ణ ,బాలాత్రిపురసుందరి దేవి ,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంయుక్త ఆధ్వర్యంలో
సోమవారం సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగలు మత సామరస్యానికి ప్రతీకలని, ఐక్యతకు నిదర్శనమని అన్నారు.సహజ సిద్ధంగా దొరికే రంగురంగుల పూలతో బతుకమ్మను నిర్వహిస్తారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోందని ఆయన అన్నారు. అనంతరం బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు.తెలంగాణ సంసృతి, సంప్రదాయాలకు ఈ బతుకమ్మ అద్దం పడుతోందని అన్నారు.పిల్లలు బతుకమ్మ పాటలుపాడుతూ, ఆడుతూ సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రకృతితో మమేకమైన మన తెలంగాణ పండుగ బతుకమ్మను పండుగను మన సంస్కృతి సంప్రదాయాలనుభావితరాలకు అందించాలని చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రపంచ నలుమూలల లో మన తెలంగాణ ఖ్యాతిని చాటాలని తెలియజేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికిచేరి ఉపాధ్యాయులకు,తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకరావాలని తెలియజేశారు. పిల్లల ఆనందం, సంతోషం కొరకు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రధానోపాధ్యాయులకు,ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయలు విజయలక్మి, రాజేశ్వరి,సౌజన్య,నీతూ శర్మ,రాజేష్, నర్మదా,రజిత, రాధ,ప్రసన్న,సబిత,శ్రీ నిత్య, జానకి,సరిత, సంయుక్త, నవీన,అలైదీత,రఘు,గీతాంజలి, విధ్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 18:20:34
Readmore >