Posted on 2024-10-06 01:15:11
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ కేంద్రంగా యారన్ డిపో ఏర్పాటు చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు
డైలీ భారత్, వేములవాడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 18 తేది 05-10-2024 ద్వారా వేములవాడ కేంద్రంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు యారన్ డిపో మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసినారు... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యారన్ డిపో ఏర్పాటు చేయడం వలన దాదాపు 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మరమగ్గాల కార్మికుల కల నెరవేరింది.. యారన్ డిపో వలన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 40 వేల మరమగ్గలపై పనిచేస్తున్న 30 వేల మంది నేతన్నలకు లబ్ధి చేకూరుతుంది..
ప్రధానంగా వేములవాడ కేంద్రంగా యారన్ డిపో ఏర్పాటు చేయడం వలన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో సుమారుగా 30 వేల మరమగ్గాల కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరనుంది
యారన్ డిపో ఏర్పాటు చేయడం వలన మరమగ్గాల పరిశ్రమలోని నేతన్నలకు పెట్టుబడిదారులపై ఆధారపడకుండా నేరుగా ఉపాధి లభిస్తుంది.. ఇట్టి యారన్ డిపోకు 50 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది..
యారన్ డిపో టెస్కో ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. మరమగ్గాల కార్మికులకు అవసరమగు నూలు టెస్కో క్రెడిట్ పద్ధతిలో సరఫరా చేసి వస్త్రాన్ని కొనుగోలు చేయను..
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యారన్ డిపో మంజూరు చేయడం పట్ల నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
వేములవాడ కేంద్రంగా యారన్ డిపో ఏర్పాటుపై స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేస్తున్నారు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, వ్యవసాయ,సహకార&చేనేత శాఖ తుమ్మల నాగేశ్వరరావు కి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా దుద్దిల్ల శ్రీధర్ బాబు కి, పొన్నం ప్రభాకర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు..
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 12:50:34
Readmore >
ఆడ పిల్లలను జన్మనిస్తుందనే సాకుతో భార్య ఇద్దరు పిల్లలను హత్య.... వరంగల్ పోలీస్ కమిషనర్
Posted On 2026-04-10 09:22:18
Readmore >
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్
Posted On 2026-04-10 08:29:28
Readmore >
AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి
Posted On 2026-04-10 08:06:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >