| Daily భారత్
Logo




మీకు.. మీ పార్టీకో దండం… ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

News

Posted on 2024-10-22 20:02:13

Share: Share


మీకు.. మీ పార్టీకో దండం… ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఇక పార్టీలో ఉండలేను

అధికారంలోకి వచ్చామని సంతోషించాల

దాడులు జరుగుతున్నాయని బాధపడాలా

డైలీ భారత్, జగిత్యాల:  మీకో దండం..మీ పార్టీ కో దండం.. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండలేనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డికి కుడి భుజంలా భావించే మారు గంగారెడ్డి హత్యకు గురికావడంతో జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆందోళన చెందారు. హత్యను నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు. అక్కడికి వచ్చిన ప్రభుత్వ విప్, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సంతోషించాలా… మాపై దాడులు జరిగి, హత్యలు జరగడంతో బాధపడాలో అర్థం కావడం లేదన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని ఆవేదన వ్యక్తం చేశారు. గంగారెడ్డి హత్య జరగడం అంటే తనపై దాడి జరిగినట్లేనని వాపోయారు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పెట్టి పనిచేసే కార్యకర్తలకు కూడా రక్షణ లేకపోతే పార్టీని ఎలా కాపాడతామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జీవన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడగా.. నాలుగు దశాబ్దాలుగా పార్టీకోసం పనిచేస్తే మంచి బహుమతి ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీలో కొనసాగే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

Image 1

సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు

Posted On 2026-04-11 08:51:32

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్బిఐ ఎటిఎం మిషన్ మాయం

Posted On 2026-04-11 08:33:02

Readmore >
Image 1

గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు

Posted On 2026-04-10 21:55:23

Readmore >
Image 1

సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

Posted On 2026-04-10 21:17:45

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

Posted On 2026-04-10 21:16:25

Readmore >
Image 1

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-04-10 20:50:16

Readmore >
Image 1

బొత్స తో తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ

Posted On 2026-04-10 20:49:00

Readmore >
Image 1

పీజీ ఫలితాలు విడుదల

Posted On 2026-04-10 20:44:45

Readmore >
Image 1

బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-10 20:41:31

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ

Posted On 2026-04-10 20:39:34

Readmore >