| Daily భారత్
Logo




మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మంద రంజిత్ కుమార్ నియామకం

News

Posted on 2024-10-25 10:51:15

Share: Share


మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మంద రంజిత్ కుమార్ నియామకం

నియామక పత్రాన్ని అందజేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జీ. చెన్నయ్య

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:  తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు నూతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మంద రంజిత్ కుమార్ ని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జీ. చెన్నయ్య ప్రకటించారు. శుక్రవారం నాడు హైదరాబాద్ లోని మాల మహానాడు జాతీయ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. బద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలురుపాడు మండల కేంద్రానికి చెందిన మంద రంజిత్ కుమార్ తెలంగాణ మలిదశ ఉద్యమంతో పాటు జేఎన్టీయుహెచ్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా విద్యా రంగ సమస్యలపై, సామాజిక ఉద్యమంలో ముందుండి పోరాటం చేస్తూ, దళిత హక్కులకై పోరాటం చేస్తున్న మంద రంజిత్ కుమార్ నీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం చేశామని పత్రిక ప్రకటన ద్వారా జాతీయ అధ్యక్షులు జీ. చెన్నయ్య తెలిపారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. నా ఎన్నికకు సహకరించిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జీ. చెన్నయ్య, తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు  డాక్టర్. బూరుగు వెంకటేశ్వర్లు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాల మహానాడు సవాలు చేసిందని, రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని తీర్పును రివ్యూ చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో ఎస్సీ వర్గికరణకు వ్యతిరేకంగా మాలలను చైతన్య పరచాలనీ అలాగే మాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి భవిష్యత్తులో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు.

Image 1

విద్యుత్ సంస్థలో సమ్మె సైరాన్...3వ రోజుకు సమ్మె చేరుకుంది

Posted On 2026-04-10 11:44:44

Readmore >
Image 1

ప్రేమజంట ఆత్మహత్య

Posted On 2026-04-10 11:41:43

Readmore >
Image 1

ఆడ పిల్లలను జన్మనిస్తుందనే సాకుతో భార్య ఇద్దరు పిల్లలను హత్య.... వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-10 09:22:18

Readmore >
Image 1

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్

Posted On 2026-04-10 08:29:28

Readmore >
Image 1

AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి

Posted On 2026-04-10 08:06:50

Readmore >
Image 1

రక్తదానం...ప్రాణదానం

Posted On 2026-04-10 08:02:42

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్

Posted On 2026-04-10 07:32:15

Readmore >
Image 1

విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-10 07:25:14

Readmore >
Image 1

ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ

Posted On 2026-04-10 06:36:42

Readmore >
Image 1

సెల్ఫీ మోజు... ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది!

Posted On 2026-04-10 05:06:54

Readmore >