Posted on 2024-10-25 08:58:33
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించిన ఈఆర్సీ సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...
తెలంగాణ ఏర్పడిన నాడు మనం తీవ్రమైన విద్యుత్ కొరతతో ఉన్నాం.
పారిశ్రామిక వేత్తలు పవర్ హాలిడేస్ వద్దని ఇందిర పార్క్ వద్ద ధర్నాలకు దిగిన పరిస్థితి. మరో వైపు రైతులు కరెంట్ లేక తీవ్ర నిరాశలో ఉన్న పరిస్థితి.
మా సిరిసిల్లలో కూాడా పవర్ లూమ్ పరిశ్రమ కరెంట్ తోనే ముడి పడి ఉంది. ఇక్కడ కూడా కరెంట్ లేక ఎంతో మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు.
తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ప్రతి మనిషికి విద్యుత్ తో విడదీయరాని సంబంధం ఉంది.
కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు పదేళ్ల పాటు విద్యుత్ సంస్థలకు సర్ణయుగంగా మారింది.
కానీ కాంగ్రెస్ వచ్చిన 10 నెలల్లోనే కరెంట్ కోతలు మొదలయ్యాయి. దానికి తోడు ఇప్పుడు కరెంట్ ఛార్జీల వాతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
పాలకులకు విజన్ ఉంటే.. సంపద పెంచి…. పేదలకు పంచాలి.. కానీ.. ప్రజలపై కరెంట్ చార్జీల భారం మోపి.. సంపద పెంచుకోవాలనే ఆలోచన చేయటం దుర్మార్గం.
డిస్కమ్ లంటే డిస్ట్రిబ్యూషన్ సంస్థలే. ఖజానాకు కంట్రిబ్యూషన్ చేసే కంపెనీలు కాదు
విద్యుత్ అంటే వ్యాపారం కాదు..రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించే రథచక్రం..
విద్యుత్ సంస్థల బలోపేతం కోసం చేసే ఖర్చు భారం కాదు. అది ప్రభుత్వ బాధ్యత.
అదనపు ఆదాయం కోసం.. 18 వేల కోట్ల అదనపు భారం మోపాలన్న కాంగ్రెస్ సర్కారు ఆలోచనే ప్రజా వ్యతిరేకమైనది.
విద్యుత్ సంస్థలు ప్రతిపాదించిన ఛార్జీలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాలని కోరుతున్నా.
వివిధ కారణాలు చెప్పిన 963 కోట్లు అప్ ఛార్జీలను ప్రజలపై భారం వేయాలనుకోవటం సరికాదు.
ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా తక్షణం రూ. 12 వందల కోట్లు పెంచుకోవటంతో పాటు డిస్కంలు చేసిన 9 ప్రతిపాదనలు తిరస్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నా.
కేసీఆర్ అధికారంలో ఉన్న్పపుడు పదేళ్ల పాటు రాష్ట్ర ప్రజల మీద ఒక్క రూపాయి భారం వేయలేదు.
రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్ట్ ఉచితంగా నీళ్లు ఇచ్చినప్పటికీ ఒక్క రూపాయి భారం వేయలేదు.
మా సిరిసిల్లలో నేతన్నలకు 10 హెచ్ పీ మీద 50 శాతం సబ్సిడీ కూడా ఇచ్చాం.
ఇప్పుడు 10 హెచ్ పీలను 30 హెచ్ పీ ల వరకు పెంచి 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నా.
ఇళ్లకు 300 యూనిట్లకు దాటితే ప్రస్తుతం ఉన్న రూ. 10 ఫిక్స్ డ్ ఛార్జీలను 50 కి పెంచాలని ప్రతిపాదించారు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం.
ఒక్క సెస్ పరిధిలోనే తీసుకుంటే లక్షా 20 వేలకు పైగా కనెక్షన్లు ఉంటే 75 వేల కనెక్షన్ల వరకు ఎండకాలంలో 300 యూనిట్లకు పైగా వాడుతున్నారు.
కరెంట్ వినియోగమనేది గతంతో పోల్చితే చాలా వరకు పెరిగింది.
ఇప్పుడు డిస్కంలు చేసిన ప్రతిపాదన ఏదైనా ఉందో పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచేలా ఉంది. ఈ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.
11కేవీ, 33కేవీ, 220 కేవీ కింద నడిచే పరిశ్రమలకు సంబంధించి అన్నింటిన ఒకే కేటగిరీ లోకి తేవటమనేది అసంబద్ధం.
అదానీ ఒక ఫ్యాక్టరీ పెడితే వారికి వర్తించే కేటగిరీనే మా సిరిసిల్లలో సాంచాలు నడిపే పరిశ్రమకు ఉంచాలనుకోవటం హేతుబద్ధమైన నిర్ణయం కాదు.
పరిశ్రమలకు సంబంధించి కరెంట్ ను అన్నింటిని ఒకే గాటున కట్టటమంటే సూక్ష్మ చిన్న, మధ్య పరిశ్రమలకు ఉరి వేస్తున్నట్లే
ఈ విధమైన కుట్ర చేస్తూ చిన్న పరిశ్రమలకు రాయితీ ఇవ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే ప్రభుత్వ అసంబద్ద నిర్ణయాలతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటు పడింది. చాలా పరిశ్రమలు తరలిపోతున్నాయి.
ఇంకా ఛార్జీలు పెంచితే పరిశ్రమలకు తీవ్ర నష్టం జరుగుతుంది. కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రలు బేంబేలెత్తేపోతాయి.
కుటీర, చిన్న, పెద్ద పరిశ్రమలను మనం కాపాడుకోవాల్సిన అవసరముంది.
డిస్కంలు చేసిన ప్రతిపాదనలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదు.
రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు మేము 12 వందల కోట్లు భరించాం. ఈ ప్రభుత్వం ఎందుకు భరించదు?
మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెచ్చిన మేము అందుకు అంగీకరించలేదు.
10 హెచ్ పీ వరకు సిరిసిల్ల నేతన్నలకు సబ్సిడీ ఇచ్చాం. నాయి బ్రహ్మణులు, రజకులకు, ఎస్సీ, ఎస్టీ లకు ఉచిత విద్యుత్ ఇచ్చే ప్రయత్నం చేశాం.
పదినెలలకే ఎందుకు ఛార్జీలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
కరెంట్ ఛార్జీల పెంపు కారణంగానే తెలంగాణ ఉద్యమం పుట్టింది. ఆనాడు ఛార్జీలు పెంచితేనే కేసీఆర్ గారు ఉద్యమం మొదలుపెట్టారు.
మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే అదే పరిస్థితి తేవటం శోచనీయం.
ఈఆర్సీ ఛైర్మన్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ప్రాంత బిడ్డగా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేకూర్చే ప్రతిపాదనలను తిరస్కరించాలని మిమ్మల్ని కోరుతున్నాను.
విద్యుత్ వ్యాపార వస్తువుగా చూడవద్దని…రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదక శక్తిగా భావించాలని కోరుతున్నాను.
నా నియోజకవర్గంలోని సెస్ అనేది చాలా ప్రతిష్టాత్మక సంస్థ.
దేశంలో సహకారం రంగంలో ఉన్న చాలా తక్కువ విద్యుత్ సంస్థల్లో సెస్ ఒక్కటి.
మా నేతృత్వంలోని ఇక్కడి సెస్ పాలక వర్గం బ్రహ్మండంగా పనిచేస్తోంది.
డిస్కంలతో పోల్చితే మా సెస్ పనితీరు 100 శాతం మెరుగు అని నేను గర్వంగా చెబుతున్నాను.
గతంలో సెస్ ను రాష్ట్ర ప్రభుత్వంలోని సంస్థల్లో కలుపాలని ప్రయత్నిస్తే ఇక్కడి ప్రాంత వాసులు వ్యతిరేకించారు.
వ్యవసాయ విద్యుత్ ను 5 నుంచి 7.5 హెచ్ పీ పెంచాలి. 7.5 హెచ్ పీకి సబ్సిడీ ఇవ్వాలి.
గతంలో ఎన్ పీసీడీఎల్ సగటు ధర నిర్ణయించేది. కానీ ఆ తర్వాత బల్క్ సప్లయ్ టారిఫ్ ఆధారంగా నిర్ణయిస్తోంది. సర్ ఛార్జీ కూడా అమలు చేస్తున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గౌరవ కమిషన్ సెస్ కొనుగోలు చేసే విద్యుత్ ను 965.26 MUగా నిర్ధారించారు. కానీ వాస్తవానికి 2023-2024 సంవత్సరానికి సెస్ కొనుగోలు చేసిన విద్యుత్ 1133.52 MUలు. అంటే.. 168.26 MUలు అదనం.
అదనపు యూనిట్లు ఖర్చు ప్రభుత్వమే భరించాలి. సెస్ ను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి.
పరిపుష్టమైన సబ్సిడీ ఇస్తూ ఎప్పటికప్పుడు ఆ డబ్బు ప్రభుత్వం నుంచి సంస్థకు వచ్చే విధంగా గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయాలి.
ఈ ప్రాంత శాసనసభ్యునిగా నేతన్నల సమస్యలు తెలిసిన వ్యక్తిగాా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా.
సిరిసిల్లలో నేతన్నల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫాం వంటి ఆర్డర్ ఇక్కడి నేతన్నలకు ఇచ్చాం.
వర్కర్ టూ ఓనర్ పథకం కోసం దాదాపు రూ. 400 కోట్లు ఖర్చు చేశాం. అప్పెరల్, టెక్స్ టైల్ పార్క్ లను బలోపేతం చేశాం. మరమగ్గాలను మోడ్రనైజేషన్ చేశాం.
గత పదేళ్లలో సిరిసిల్లలో ఆత్మహత్యలు ఆగిపోయాయి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 10 మందికి పైగా నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు.
సిరిసిల్లలో 10 హెచ్ పీ ల వరకు మాత్రమే సబ్సిడీ ఉంది. దాన్ని 30 హెచ్ పీ వరకు పెంచాలి.
సిరిసిల్లను మరో తిరుపూర్ చేయాలని కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రయత్నం చేసింది.
ఇప్పుడున్న ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వటం లేదు. వారికి ఆర్డర్లు వచ్చే విధంగా ప్రభుత్వాన్ని కోరాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా.
మానవీయ కోణంలో ఆలోచించి ఇక్కడ ఉన్న 10 హెచ్ పీ సబ్సిడీని 30 హెచ్ పీ ల పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నా.
మొత్తంగా ప్రజలపై 18 వేల కోట్ల భారాన్ని మోపాలని చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతున్నా.
అదే విధంగా డిస్కంల ప్రతిపాదనలను తిరస్కరించాలని ఈఆర్సీకి విజ్ఞప్తి చేస్తున్నా.
సెస్ ను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మీ తరఫున సూచనలు చేయాలని విజ్ఞప్తి
విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి బహిరంగ విచారణను మా సిరిసిల్లలో నిర్వహించినందుకు ఈఆర్సీ ఛైర్మన్ కి కృతజ్ఞతలు
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 12:50:34
Readmore >
ఆడ పిల్లలను జన్మనిస్తుందనే సాకుతో భార్య ఇద్దరు పిల్లలను హత్య.... వరంగల్ పోలీస్ కమిషనర్
Posted On 2026-04-10 09:22:18
Readmore >
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్
Posted On 2026-04-10 08:29:28
Readmore >
AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి
Posted On 2026-04-10 08:06:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >