| Daily భారత్
Logo




తప్పుడు కేసు పై పోలీసులు పునః విచారణ చేపట్టాలి.. సిపికి బాధితుల ఫిర్యాదు

News

Posted on 2025-07-14 21:11:52

Share: Share


తప్పుడు కేసు పై పోలీసులు పునః విచారణ చేపట్టాలి.. సిపికి బాధితుల ఫిర్యాదు

అక్రమ అట్రాసిటీ కేసులు పెట్టిన మాజీ ఎంపిటిసీ పై చర్యలు తీసుకోవాలి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అక్రమంగా అట్రాసిటీ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్న మాజీ ఎంపీటీసీ చందర్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు బాధితులు గున్నాల మురళీ గౌడ్ భార్య సుజాత, కొడుకు భార్గవ్ గౌడ్ తో కలసి ఫిర్యాదు చేశామన్నారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన సిపీ విచారణ జరిపించి తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ.. గతంలో తమకు ఇందిరమ్మ హయంలో ప్రభుత్వ భూమిని బ్రతుకుతెరువు కోసం ఇవ్వడం జరిగిందని, అట్టి భూమిపై కన్నేసిన కొండాపూర్ మాజీ ఎంపీటీసీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో తన పలుకుబడిని ఉపయోగించి భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడం జరిగిందని ఆరోపించారు. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రికార్డులను తారుమారు చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు. తమ వద్ద భూమికి సంబంధించిన పాత, కొత్త పాస్ బుక్ ఉన్నప్పటికీ, మమ్మల్ని భూమి వైపు వెళ్లకుండా భయభ్రాంతులకు గురి చేశారన్నారు. మాకు రైతుబంధు కూడా రాకుండా అధికారులతో నిలిపి వేయించారన్నారు. ఆక్రమించుకున్న విషయం తెలుసుకున్న మేము కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్లి నిలదీయడంతో వారి మనుషులతో దాడి చేయడమే కాకుండా పోలీసులతో కుమ్మక్కై తమపై అక్రమంగా అట్రాసిటీ కేసు నమోదు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు సంవత్సరాలుగా కేసు గురించి కోర్టు చుట్టు తిరుగుతున్నామని, కోర్టు చుట్టూ తిరుగుతూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. మాకు ప్రాణ భయం ఉందని, దీనిపై తదుపరి సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని లేదంటే చావే శరణ్యమని అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని, అనంతరం పోలీస్ కమిషనర్ ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేసామన్నారు. గతంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడంతో అధికార పార్టీ ఎంపీటీసీపై ఏలాంటి చర్యలు తీసుకోలేకపోయారని వాపోయారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లామని, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి మా ఆవేదనను వెళ్లిబుచ్చుకున్నామని,  ఇకనైనా మాకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. మాభూమిని కొనుగోలు చేశానని తప్పుడు ప్రచారం చేస్తున్న మాజీ ఎంపీటీసీపై చర్యలు తీసుకొని మా భూమిని మాకు ఇప్పించాలని విజ్ఞపించారు.

Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >