Posted on 2025-07-20 21:12:05
నందిపేట్ బ్యాక్‌వాటర్స్‌లో పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమం
నిజామాబాద్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వైల్డ్‌లైఫ్ సొసైటీ కార్యదర్శి క్యాతం సంతోష్ కుమార్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వైల్డ్‌లైఫ్ సొసైటీ న్యూస్ కార్యదర్శి క్యాతం సంతోష్ కుమార్ , సమన్వయకర్త హీతెన్ భిమానీ ,నవ్య భారతీ గ్లోబల్ స్కూల్ , సంయుక్తంగా నందిపేట్ బ్యాక్‌వాటర్స్ పరిశుభ్రత, అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. గత వారం విద్యార్థులకు నిర్వహించిన ఫాస్ట్‌ట్రాక్ అవగాహన శిక్షణ కార్యక్రమానికి ఇది కొనసాగింపుగా కొనసాగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమం ప్రధానంగా ప్రకృతి ప్రదేశాల పరిరక్షణ , ప్రజా ప్రదేశాలలో శుభ్రతపై సామాజిక అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.
ఈ సందర్భంగా ప్రతి సందర్శక వాహనానికి ట్రాష్ బ్యాగులు (కంచెలు) అందజేయడం జరిగిందని ,ఇలా చేయడం ద్వారా పర్యాటకులలో బాధ్యతాయుతమైన ధోరణి పెంపొందించి, పరిసరాలను శుభ్రంగా ఉంచాలనే సందేశాన్ని ప్రచారం చేశామన్నారు. బహిరంగ ప్రదేశాల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చిన్నారెడ్డి, నిజామాబాద్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వైల్డ్‌లైఫ్ సొసైటీ న్యూస్ కార్యదర్శి సంతోష్ కుమార్, నిజామాబాద్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వైల్డ్‌లైఫ్ సొసైటీ న్యూస్ ప్రతినిధి ఈ కార్యక్రమ సమన్వయకర్త హీతెన్ భిమానీ, నవ్య భారతీ గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆంతోనీ , విద్యార్థులు అధ్యాపక బృందం పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >