Posted on 2025-07-20 21:22:33
అతిథిగా విచ్చేసిన ఎస్పీ రోహిత్ రాజ్
పేదలకు వైద్య సేవలు అందించిన డాక్టర్ బాబురావు, రాజశేఖర్ అయ్యప్ప, స్రవంతి
సంతోషం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు
డైలీ భారత్, జూలూరుపాడు, భద్రాద్రి న్యూస్:జూలూరుపాడు మండల పరిధిలో నల్లబండ బోడు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం సీనియర్స్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది. ప్రజల సంక్షేమం కోసం జిల్లాలోని పోలీసు వ్యవస్థ మీడియా మరియు వైద్య బృందం కలిసి చూపిన సామర్థ్యానికి హృదయపూర్వక అభినందనలు గ్రామ ప్రజలు తెలియజేశారు. ఉచిత వైద్య శిబిరానికి అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రజల ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా భావిస్తున్న నాయకుడిగా అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఎస్పీ రోహిత్ రాజ్ కేవలం పోలీస్ అధికారి మాత్రమే కాదు ప్రజల పట్ల సానుభూతితో ముందుకు సాగుతున్న ఒక నిజమైన ప్రజానాయకుడు ఆయన సాధారణ ప్రజల మధ్యకు వచ్చి ఆరోగ్య కార్యక్రమాలను ప్రోత్సహించడం అతిథిగా హాజరై ప్రజలకు మానవతా స్పృహను చేరవేయడం గొప్ప విషయం. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 24 గంటలు చాలా బిజీ గా రోగులకు వైద్యం అందిస్తూ ఉంటూ కేవలం ఆదివారం కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే సమయాన్ని కూడా వదులుకొని పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి సమయాన్ని కేటాయించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ బాబురావు, రాజశేఖర్ అయ్యప్ప, స్రవంతి లను ఎస్పీ ప్రశంసించారు. గ్రామస్తులంతా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బాగా చదివించాలని గ్రామస్తులను కోరారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా, అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. మారుమూల ఆదివాసి గిరిజన గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన జూలూరుపాడు సీనియర్స్ ప్రెస్ క్లబ్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వైద్యులు రోగులను పరీక్షించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ రోహిత్ రాజుకు ప్రెస్ క్లబ్ సభ్యులతోపాటు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అతిధులను శాలువాతో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్బిసిఐ శ్రీనివాస్, శ్రావణి మెడికల్ డిస్ట్రిబ్యూటర్ ఢిల్లీ వెంకటేశ్వర్లు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక చంద్రశేఖర్, ఆదివాసి గిరిజన నాయకులు బచ్చల లక్ష్మయ్య, కొర్స రమేష్ తోపాటు, పోలీస్ సిబ్బంది గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >