Posted on 2025-07-20 22:51:30
లక్షలకు లక్షలు వైద్యం పేరిట వసూలు చేస్తున్న ప్రవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు
వైద్య చికిత్స పేరుతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి యువకుడు మృతి..
నామమాత్రంగా చేపడుతున్న డిఎంహెచ్వో అధికారుల తనిఖీలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని మండలం సిద్ధాపూర్ గ్రామానికి చెందిన యువకుడు కెతావత్ భాస్కర్(19)కు వెన్నునెప్పితో బాధపడుతున్నాడు. దీంతో శనివారం ఉదయం ఒకటో టౌన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్పైన్ సర్జరీ నిమిత్తం చేరాడు.
ఆపరేషన్‌కు సిద్ధమైన వైద్యుడు యువకుడికి సర్జరీ చేసే క్రమంలో అనస్థీషియా(Anesthesia) ఇచ్చారు. అనంతరం సదరు యువకుడి మృతి చెందాడు. కాగా.. అనస్థీషియా డోస్ ఎక్కువ కాడంతో యువకుడు మృతి చెందాడని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. సీపీఆర్ (CPR) చేసినప్పటికీ ప్రాణాలు దక్కలేదని.. వైద్యుల నిర్లక్ష్యంతోనే యువకుడు మృతి చెందాడని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాధితులు ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. మృతుడు కెతావత్ భాస్కర్‌కు ఇటీవలే ఐఐటీ మద్రాస్‌లో సీటు కూడా వచ్చింది. అంతలోనే ఈ ఘోరం జరిగిందని బాధితులు రోధించారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >